కదను త్రొక్కకుమో.. కడలి మాతా !

Monday 15 November 2010

అది 1977 సంవత్సరంలో నవంబర్ 17వ తారీఖు !
శనివారం ఆరోజు  !
ఆ రోజు వచ్చిన ఉప్పెన లక్షల మంది జీవితాలను అతలాకుతలం చేసింది !
ప్రకృతి తన గొప్పదనాన్ని చాలా ఉగ్రంగా రుజువు చేసింది !
సేవా కార్యకర్త గా దివిసీమను చూసిన నా చిరు హృదయం లో నుంచి వచ్చిన బావన ఇది !
మొన్న జల్ తుఫాను ఇలా  రాకూడదని కోరిన కోరిక ఫలించినందుకు సంతోషం !


కడలి అంచులదాక..
కడలి పోయేదాక..
కదను త్రొక్కకుమో  ..
కడలి మాతా !
  కరువైన నేస్తాల..
  కడుచక్కని రూపాలు.. 
  కనులలో కదులాడ..
  కన్నీరు కురిసేను !
కన్నుగానక మేము..
కదులాడుతున్నాము ..
కందమూలాలతోనైన..
కడుపు నింపాలన్న..
కరువైనవవికూడా !
  కమ్ముచున్నవి మబ్బులూ..
  కనరాదు భూదేవి..
  కడకేమి అగుదుమో..
  కర్తవ్యమేమోగా ?
కన్నీరు కారనీకో కడలిమాతా !
కష్టాలు కల్పింపకో కడలిమాతా !
కళ్ళతో నినుగొల్తుమో కడలిమాతా !
కరుణ కురిపింపవే కడలిమాతా !

6 comments:

Anonymous said...

భారతీయ సంప్రదాయంలో కడలి మాత కాదు. పితే. సముద్రుడు అనే మాట వినలేదా ? నదులకు భర్త సముద్రుడని పురాణాలు.

ప్రభు said...

ఓబుల్ రెడ్డి గారికి : సాహిత్య పరంగా మీరన్నది అక్షరాలా నిజమేనేమో !
నదులన్నీ సాగరంలో కలుస్తాయని కూడా విన్న మాటే !
కానీ సార్ ఒకసారి ఆ బెస్తవాడల కు వెళ్లి చూస్తే సముద్రాన్ని తల్లిగా ఎలా కొలుస్తారో తెలుస్తుంది !
అయితే ఇది మనసులోంచి వచ్చేసిన భావనే గానీ, సాహిత్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు !
అది సాహిత్య దోషంగా భావిస్తానంటే మీ ఇష్టం !
మీ లాంటి సాహితీ ప్రేమికుల తిట్ల శిక్షకు సిద్ధం !

వేణు said...

దివిసీమ ఉప్పెన విరుచుకుపడింది- నవంబరు 19న! టపాలో 17న అని రాశారు మీరు. పశ్చిమ కృష్ణాలోని మా ఊళ్ళో నా చిన్నప్పుడు భయకంపితం చేసిన నాటి తుపాను హోరు ఇప్పటికీ నా చెవుల్లో గింగురుమంటుంది.

మీ కవితలో ‘క’ అక్షరాన్ని పదేపదే ప్రయోగించటం వల్ల స్వాభావికంగా అనిపించలేదు కానీ, మొత్తమ్మీద మీ ప్రయత్నం బాగుంది.

ప్రభు said...

వేణు గారూ :
అవును 19 వ తేదీనే సరి అయింది !
అప్పుతచ్చు పడిపోయింది ! క్షంతవ్యుడిని !
19 న ఉప్పెన వస్తే, 21 న మేము వాలంటీర్లు గా వెళ్ళాము !
అప్పుడు బాగా చిన్నవాణ్ణి అంత ఆలోచన లేదు !
ప్రాస అనుకోకుండా వచ్చింది !
ఆ తుఫాను రోజున ఎన్నో కిలో మీటర్ల దూరాన ఉన్న మాకే చెవులు గింగిరులెత్తించిన హోరు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది !

Anonymous said...

Comment form పైన మీరు పెట్టిన నోట్ చాలా సుదీర్ఘంగా సుత్తిగా ఉంది. అంత అవసరం లేదని నా భావన.

ప్రభు said...

ఓబుల్ రెడ్డి గారూ:
కొందరలా పెట్టమని చెప్పాకే పెట్టాను గురువుగారూ !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )