పుట్టి ముంచిన రోశయ్య !

Wednesday, 24 November 2010

మొత్తానికి పెద్దాయన అరిచి, అరిచి అలిసిపోయి రాజీనామా సమర్పించాడు !
సమస్యలతో సతమతం అవుతున్న మన రాష్ట్రాన్ని హుస్సేన్సాగర్లో ముంచేసి ఇంకో రాష్ట్రం లో గవర్నర్ గిరీ వెలగ పెట్టడానికి తయారై పోయారు రోశయ్య గారు !
చంద్రబాబు ను తిట్టినట్లుగానే విలేఖరులనూ తిట్టి రోశయ్యకు రోషం ఎక్కువ అనిపించుకున్నాను అని ఆయన అనుకున్నారేమో కానీ ఆడలేక మద్దెల ఓడు అన్నసామెతను గుర్తు చేసారాయన !
ఇప్పుడు కొత్త ముఖ్య మంత్రి ఎన్నిక చేయడానికి అంతా కలుస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు కానీ.... సాయంత్రం సోనియా చేతిలోనే భారం పెట్టి చేతులు దులుపుకున్నా ఆశ్చర్యం లేదు !
కొత్త ముఖ్యమంత్రి ఎవరైనా కానీ, ఖాళీ అయినా ఖజానా, పెరిగిన గ్రూపుల సంఖ్య, రగులుతున్న తెలంగాణా లాంటి సమస్యల గుర్రాలకు కళ్ళెం వేయడం అంత తేలిక కాదు !
ఏది ఏమైనా నోటి దురుసు లేని వాళ్ళూ, నయానో భయానో అందరినీ ఒక్క త్రాటిమీదకు తేగల వాళ్ళూ వినిపిస్తున్న పేర్ల జాబితాలో కనిపించట్లేదు మరి !
కాంగ్రెస్ నూ  మన రాష్ట్రాన్నీ దేవుడే కాపాడాలి

1 comments:

krishna said...

తన హయాం లో తెలంగాణా నిర్ణయం జరగకూడదని...సమైక్యాంద్రా వారి చూపుల్లో ద్రోహి గా మిగిలొఫొకూడదని....చివరి రొజులు గడుపుతున్న తనకి అది అంట మంచిది కాదని...
రోశయ్య వ్యక్తిగత అభిప్రాయం కావచ్చు!

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )