కే.సి.ఆర్. గారి కూలి డబ్బులు !

Friday, 26 November 2010

 కే.సి.ఆర్. గారికి పాపం వరంగల్ సభ కోసం జన సమీకరణ చేయాలంటే పలచబడిన పరువుతో సాధ్యం కావట్లేదు అనుకుంటా !
రోజుకో విధంగా మాట్లాడి, చేతలకు మాటలకు పొంతన లేకుండా ప్రవర్తించీ తనను తానే చులకన చేసుకున్నారాయే !
కే.సి.ఆర్. గారి మాటలు విని తెలంగాణా సానుభూతిపరులు ఆర్ధిక సాయం చేయడం కూడా ఆపేసినట్లు ఉన్నారు !
పరిశ్రమల యాజమాన్యాన్ని పిలిచి బెదిరించి డబ్బులు వసూలు చేద్దామంటే మన తెలంగాణా వాదులే తిడుతున్టిరి !
ఇంకేమిటి దారి ?  రోజూ కొన్ని నిముషాలు కూలీ పని చేసి డబ్బులు సంపాయిస్తున్నారు !
రోజు కూలీ అంటే మహా అయితే రెందొందలూ, లేకపోతే గొప్ప పనిమంతుడైతే అయిదొందలు సంపాయించ వచ్చు !
మరీయనకు కష్టపడి ఎన్ని దినాలాయె, ఏమి పని చేస్తారు ?  ఎంత సంపాయిస్తారు  ?
అలా ఆమ్ ఆద్మీ లా సంపాయిస్తే ఆయన నేత ఎలా అవుతారు ? సభలోపు ఎంత సంపాయిస్తారనీ ?
మొన్న పాపం ఒక కంపెనీకి వెళ్లి కాసేపు ఆ పనీ ఈపనీ చేసినట్లు ఫోటోలు దిగేసి  ఓ ఐదు లక్షలు కూలడిగే సరికి ఆ యాజమాన్యం దిమ్మ దిరిగి పోయి, పోన్లే మన కంపెనీకి వచ్చీ ఫోటోలు దిగావు, ఇంత జనాన్ని వెంట పెట్టుకోచ్చావు కాబట్టి ఓ పాతిక వేలిస్తలే కూలి కింద లేక్కేసుకో అన్నారు !
దిమాక్ గానీ ఖరబ్ అయ్యిందా అని తీసుకోకుండా వెళ్ళిపోయారు మన ఘనత వహించిన కే.సి.ఆర్. గారు !
ఇంక నిన్న ఇంకో కంపెనీలో మళ్ళీ ఇజ్జత్ ఖరాబు కాకుండా ముందే చెప్పున్చిన్రేమో కూలి చేసిన యాక్షన్ చేసేయగానే చప్పట్లు కొట్టి ఒక లక్ష రూపాయలు చేతిలో పెట్టి నమస్కారం చేసేసారు కంపనీవాళ్ళు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )