హైదరాబాదు రోడ్లిలా ఎందుకున్నాయి ?

Tuesday, 30 November 2010

మన మేయర్ గారు అమెరికా తిరిగి వచ్చిన తరువాత ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మన నగరం, దాంట్లోని రోడ్లు అధ్వాన్నంగా ఉండటానికీ, అక్కడి రోడ్లు, నగరాలు గొప్పగా ఉండటానికీ మధ్య తేడాలలో ముఖ్యమైనది ప్రజల అలవాట్లూ, వాటిని పాడు చేయకూడదని వాళ్ళ మనసులో ఉన్న ధృడ నిశ్చయమూ అని తేల్చేసారు ! రేపు ఎవరైనా ఇన్ని కోట్లు పోసి వేస్తున్న రోడ్లు ఏమైనాయి అని అడిగితే చెప్పేయడానికి సమాధానం ఇప్పుడే తయారు అయిపొయింది అన్నమాట !
ఒక విధంగా అది కూడా నిజమేనేమో ?
మనం మన కార్పోరేటర్లను నిలదీయం !
ట్రాఫిక్ రూల్స్ చస్తే పాటించం !
చెత్తను కుండీలలో తప్ప అన్ని చోట్లా పారేస్తాం !
సందు దొరికితే ఫ్లేక్సీలూ, తోరణాలూ కట్టి తీయకుండా వదిలేస్తాం ! ( కోపం వస్తే రోడ్డు మీదే దిష్టి బొమ్మలతో కలిపి తగలేస్తాం ! )
పెరిగే జనాభాకు సరిపడా సులభ కాంప్లెక్సులు లేవు కాబట్టి రోడ్డు మీదే పని కానిచ్చేస్తాం !
కిళ్ళీలు నములుతుంటాం కాబట్టి కళ్ళు మూసుకుని పక్కకు ఊసేస్తాం ! అవి ఎవరి మీద పడుతున్నాయో కూడా చూడం !
సిగరెట్టు పొగ  స్తయిల్గా పీల్చేసి పక్కనున్న పిల్లల్నీ, వృద్దుల్నీ చావండిరా అంటూ ముఖం మీదికి ఊదేస్తాం !
అలా చేస్తే దండించరు  కాబట్టి చేసేస్తాం !
 ఇవన్నీ ఇదివరకూ ఉన్నాయి !
కానీ వీటికి తోడు ఇప్పుడు అవినీతి తో కట్టిన రోడ్లూ, పట్టించుకోని ఇంజనీర్లూ, పారిశుధ్య సిబ్బందీ మనని కోట్లు ఖర్చు పెట్టినా కూపం లోనే బ్రతికిస్తున్నాయ్ !
 మేయరు గారు ఇదే నగరం కొన్నేళ్ళ క్రితం వరసగా నాలుగు సంవత్సరాలు దేశం మొత్తం మీద పరిశుభ్రమైన నగరం గా నిలిచి ఇప్పుడు ఇలా భ్రష్టు పట్టడానికి కారణాలు గుర్తించడం మరిచి పోయారు !
ఒక రోడ్డు సుందరంగా, గుంటలు లేకుండా ఉందీ అంటే ఈ కింద ఇచ్చిన కారణాలే తోస్తున్నాయి ప్రస్తుతానికి :
- ఆ రోడ్డు సి ఏం గారి ఇంటికి వెళ్ళేది అన్నమాట !
- ఆ రోడ్డు వేసింది పదేళ్ళ క్రితం అయి ఉండాలి !
- ఆ రోడ్డు వేసిన, మైంటైన్ చేస్తున్న వాళ్లు నీతి మంతులై ఉండాలి !
-  అది ఏ ప్రయివేటు రోడ్డో కావచ్చు !
- దానిమీద ఇంకా మైంటైన్ చేసేవాళ్ళ కళ్ళు పడలేదన్నమాట ( రోడ్డు కొట్టు - బిల్లు పట్టు కోసం ) !
అంతేనంటారా మేయర్ గారూ ?

1 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

పదేళ్ళక్రితం హైద్రాబాద్ సిటీ వరుసగా క్లీన్ సిటీగా పేరుపొందింది.
ఈ నగరం గురించి నేషనల్ జగ్రాఫికల్ పత్రిక కూడా అప్పటి
ముఖ్య మంత్రి గురించి కూడా గొప్పగా వ్రాసింది. రాజధాని
నగరమే అట్లా వుంటే మరి ఇతర నగరాల రోడ్ల దుస్తితిగురించి
వెరే చెప్పక్కరలేదు.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )