చలో హైదరాబాద్ !

Friday 12 November 2010

ఈ రోడ్డేసిన వాడెవడో  కానీ నాక్కనబడితే చంపేస్తా !
ఇలా ఉంటే బళ్ళకు పంచర్లు ఎప్పుడు పడాలి ?
నాకు అస్సలు బేరాలే రావట్లా !
మా బామ్మరిది హైదరాబాదు నుంచి రోజూ ఫోను !
ఇక్కడికి రాబావా మా దందా  ఇక్కడ బావుంది అంటాడు !
అక్కడ రోడ్డుమీద పంచరు పడని బండే  ఉండదట !
కొత్తగా వేసిన రోడ్డ్లు కూడా చక్కగా గతుకులతో ఉంటాయిట !
ఒఖవేళ పొరబాటున బాగా వేసినా రెండో రోజే తవ్వేసి వదిలేస్తారట అక్కడి మునిసిపాలిటీ వాళ్ళు !
చూస్తా... ఇలా తవ్వినాక కూడా బేరాలు రాకపోతే  " చలో హైదరాబాద్ " !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )