మంత్రి పదవి అలంకరిన్చకుండానే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన మొదటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రికార్డ్ కొట్టేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు !
స్పీకర్ గా పని చేస్తూ ఎన్నో ముఖ్యమైన సమస్యలను సరిగా అసెంబ్లీ లో చర్చించకుండా తన చాకచక్యంతో అడ్డుకోవడంలో సఫలీకృతం అయిన కిరణ్ కమార్ రెడ్డి గారు అదే సమస్యలను ఎంత చాకచక్యంతో ఎదురుకొని ఫలితం సాధిస్తారో ఎదురు చూడాల్సిందే !
జీతాలు తప్పితే ఇంకేమీ ఖర్చు పెట్టగల స్థితిలో లేని ఖజానా, స్టయిపెండ్ల సమస్యలో చిక్కుకు పోయిన పేద విద్యార్ధులూ, వరుస వరదలతో నలిగిపోయిన రైతన్నలూ, సమ్మెలు చేస్తున్న ప్రభుత్వోద్యోగులూ, ఆకాశాన్ని అంటిన ధరలూ, మితిమీరిన అవినీతి, మొదలే కాకుండానే ఖజానా కబళించి వేసిన ప్రాజెక్టులు, కాంగ్రెస్ లో గ్రూపులై కొట్టుకుంటున్న జగన్, ఇతర వర్గాలూ, అన్నిటినీ మించి త్వరలో రాబోతున్న శ్రీకృష్ణ కమిటీ రిపోర్టూ దాన్ని అంటుపెట్టుకుని ఉన్న పేలబోతున్న అగ్నిపర్వతం లా అణచి పెట్టబడి ఉన్న భావాగ్నిలాంటి సమస్యల విషవలయంలో నుంచి దెబ్బలు తినకుండా బయటపడాలంటే ఏ ముఖ్యమంత్రికైనా కత్తిమీద సాములాంటి విద్యలో ఆరితేరిన అనుభవమో, అల్లాదీన్ దీపమో, అక్షయ పాత్రో, మాయలపకీరు మంత్రదండమో కలిగి ఉండటమో కావాల్సిందే !
ఆ విషయం తెలిసేనేమో జగన్ వర్గం, జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాలని అంత పట్టు పట్టలేదు !
సాక్షిలో సోనియా మీద చెణుకులు విసరకపోయి ఉంటే నన్నేసి. ఎమ్. చేసి ఉండేవాళ్ళు బ్రతికి పోయా అని జగన్ భావించినా ఆశ్చర్యం లేదు !
జగన్, కిరణ్ లలో అదృష్టం ఎవరిదీ ?
Thursday, 25 November 2010
Posted by ప్రభు at 11/25/2010 01:57:00 pm
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
సమస్యల విషవలయంలో నుంచి దెబ్బలు తినకుండా బయటపడాలంటే ఏ ముఖ్యమంత్రికైనా కత్తిమీద సాములాంటి విద్యలో ఆరితేరిన అనుభవమో, అల్లాదీన్ దీపమో, అక్షయ పాత్రో, మాయలపకీరు మంత్రదండమో కలిగి ఉండటమో కావాల్సిందే !
ఆ విషయం తెలిసేనేమో జగన్ వర్గం, జగన్ ను ముఖ్యమంత్రి చెయ్యాలని అంత పట్టు పట్టలేదు !
సాక్షిలో సోనియా మీద చెణుకులు విసరకపోయి ఉంటే నన్నేసి. ఎమ్. చేసి ఉండేవాళ్ళు బ్రతికి /porapaddaaru.jaganki cm seat ichhivunte sontha dabbainaa karchu pettaenduku venkaadevaadukaadu.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )