కుర్రతనపు ట్రాఫిక్ సిగ్నల్స్ !

Saturday, 30 October 2010

 మీరు ఆ తమలపాకులపై రంగులు ఎందుకద్దుతారు ?
అది చూసి కవులు దొండ పళ్ళని  భ్రమ పడుతుంటారు !
వాటిని చూస్తూ ట్రాఫిక్ జామ్ చేస్తూ ఆగిపోతుంటారు కుర్రకారు !
మీ బొమ్మలను చేసిన బ్రహ్మా అవుతుంటాడు బేజారు !

అదిగో తుమ్మెదలు కూడా వస్తున్నాయి !

మీరు కురులలో విరులు కూర్చీ కూర్చీ ,
ఇప్పుడు నీ కురులే విరులైనట్లు అనిపిస్తోంది నాకు !
ఇది నా భ్రమా లేకపోతే నీవు వనకన్యవా ?

నీరు పల్లమెరుగు.... మరి రక్తం ?

ఒక సైన్సు టీచర్ తన క్లాసు పిల్లలకు రక్త ప్రసరణ గురించి చెప్పడం కోసం ప్రయత్నిస్తూ కాస్సేపు శీర్షాసనం వేసి తన ముఖం ఎర్రగా అవడాన్ని గమనించమన్నారు !
" పిల్లలూ మీరంతా ఇందాక నేను శీర్షాసనం వేసినప్పుడు భూమ్యాకర్షణ శక్తి వల్ల రక్తం అంతా నా తల వేపుకి ప్రసరించి నా ముఖం ఎర్రగా అయిపోవడం గమనించారు కదా ? "
 పిల్లంతా కోరస్  లా అన్నారు "యస్ టీచర్ ! "
" మరి ఇప్పుడు అలోచించి  చెప్పండి నేను మళ్ళీ మామూలుగా నుంచుంటే నా కాళ్ళలోకి అలా రక్తం ఎందుకు రాలేదో ? "
ఎవ్వరూ మాట్లాడ లేదు !
చివరికి ఒక పిల్లాడు చెప్తానని చెయ్యెత్తాడు !
"  వెరీ గుడ్ ! చెప్పరా ఎందుకంటావ్ ? "
" బహుశా కాళ్ళలో  ఖాళీ లేదేమో టీచర్ ! " ఉత్సాహంగా చెప్పెసాడా పిల్లాడు గర్వంగా చుట్టూ చూస్తూ !

కొత్త స్పీడ్ బ్రేకర్ !

 ఇలా ఇక్కడ పెట్టిన దగ్గరినుంచీ ఇక్కడ ప్రమాదాలు తగ్గాయి !

నేనా ? కరీనానా ? జీరో ఎవ్వరు ?

సర్లే సంబడం !
నీది జీరో సయిజేం కాదు !
నువ్వేం కరీనాకు పోటీ కాదు !
నాలా పెద్దయితే నువ్వూ ఇంతే ఉంటావ్ !
పోవే పిల్లకానా !

సర్లే ఇంక లే లేకపోతే తడిచిపోతావ్ !

ఈ ప్రకృతిలో నిదురించి నీ కలలు కంటుంటే ఎంత హాయి !
నీ కౌగిలి నన్ను  అలలలా  తాకి చక్కలిగింతలు పెడుతోంది !

ముక్కు కొరుకుతా !

నేను నిద్రపోతుంటే నన్నొదిలేసి వెళ్లిపోయావ్ !
ఆ మునిసిపాలిటీ వాళ్లోచ్చి  మన ఇల్లంతా పీకి పడేస్తుంటే ఎంత భయమేసిందో తెలుసా ?
మళ్ళీ వెళ్తావా అలా ? అమ్మా !

ఫ్రీ రైడ్ !

కంగారు పడకండి !
యాక్సిడెంట్ ఏమీ కాలేదు !
అది నాకారే !
ఈ బండి ఇచ్చేసినాక ఇంటికి వెళ్ళొచ్చు అని  వెంట తీసుకు వెళ్తున్నా !

అలా తిరిగొస్తాం !

నువ్వొక్కడివే ఎప్పుడూ జామ్మని తయారయి షికారు కు వెళ్తావే ?
మమ్మల్నీ తీసుకెళ్తే లోకం చూస్తాంగా ?

కొత్త బీర్ బల్ !

హుషారు కావాలంటే... బేజారు పోవాలంటే...
మందొక్కటే మందురా !
ఈ బీరెవడు కనిపెట్టాడో కానీ భలే కిక్కిస్తోంది !

జరా భద్రం !

ఒరేయ్ దాన్ని చూసి మోసపోకు !
అదేం దేవకన్య కాదు !
ఎక్కడో బ్యూటీ పార్లర్ కి వెళ్లి మేకప్ చేసుకొచ్చింది !

ధన్యవాదాలు మహాత్మా !

ఈ మట్టిలో మట్టిగా ఉన్న మాకు ఒక రూపాన్ని ఇచ్చిన ఓ మహా శిల్పీ నీకు వందనం !

నువ్వు నాకు నచ్చావ్ !

నువ్వు చెప్పేవి అన్నీ కథలే అని తెలుసు !
నా నుంచి తప్పించుకోవడానికే నువ్విలా వేషాలేస్తున్నావనీ తెలుసు !
కానీ ఒకటి మటుకు ఒప్పుకోవాలి నీలో చాలా క్రియేటివిటీ ఉంది !
ఇక్కడే ఉండరాదూ  ?

ఇలాంటి బేబీ సిట్టర్లు ఉంటే ఇంక అంతే !

Friday, 29 October 2010

గవ్వల గుడి !

గవ్వలు పనికి రావని చాలా మందికి అనిపిస్తుంటుంది ! 
చేతిలో చిల్లి గవ్వ కూడా లేదనీ ,  నువ్వెంత గుడ్డిగవ్వకు కూడా పనికిరావనీ అంటూ ఉంటారు కూడా !
అలాంటి గవ్వలనే కూర్చి హాంకాంగ్ లోని ఒక మందిరాన్ని ఎంత అందంగా చేసారో చూడండి !








ఎవరక్కడ ?

మేము నెమ్మదిగా, ప్రేమతో చెబుతోంటే మీకు అర్థం కావట్లేదు కదా ?
అందుకనే ఈ సెట్అప్ !

ఇస్తా మస్కా !

ఇందాకటి నుంచీ నా వెనకే నెమ్మదిగా చప్పుడు చేయకుండా వస్తున్నారు వీళ్ళు !
నన్ను గుర్తు పట్టి ఉంటారా ?
నా మారువేషం పని చేయలేదా ఏమిటి ?
ఎలాగైనా ఏమార్చి పారిపోతాను !
ఈ విషకంఠం  ముందు ఈ పిల్ల కాకులొక లెక్కా ?

ప్లేస్ మార్చాలి !

ఇక్కడిలా ఉంటే నేను సేఫే కానీ నా గర్ల్ ఫ్రెండ్ కి కనిపిస్తానో లేదో ?

కత్రీనా ఫేన్లు !

నువ్వు చెబితే నమ్మలేదు కానీ !
స్విం సూట్లో కత్రీనాను చూస్తుంటే తనివి తీరట్లేదు !
ఈ షూటింగ్ ఇక్కడ ఎన్నాళ్ళు  ఉంటుందో ?
మనోళ్ళంతా తిండి మానేసి ఆమెనే చూస్తున్నారు !

ఎప్పుడూ అదే తిండంటే బోర్ !

వాడు తినను అంటున్నాడని మీరు వర్రీ అవుతున్నారు ఒప్పుకుంటాను !
కానీ ఓ బర్గర్ ముక్కో, పిజ్జా స్లైసో తెమ్మని రోజూ అడుగుతున్నాడుగా ?
ఒక సారి తెచ్చివ్వోచ్చుగా ?
మెక్ డోనాల్డ్, కానీ డామినోస్ కానీ కనిపించట్లేదా దారిలో  ?

అదిరేటి స్టెప్పు !

నన్ను డిసటర్బ్ చెయ్యకండి !
సల్సా బాగా నేర్చుకుంటే కానీ నాతో పాటు డిన్నర్ కి రానంటోంది నా గర్ల్ ఫ్రెండ్ !

అన్యాయం !

అదే నాకు మండేది !
ఇక్కడేమైనా చేపలున్నాయా ?
అసలు నీళ్ళే లేవాయే !
నేను యోగా చేసుకుంటుంటే దొంగ జపం కొంగ జపం అని మీరనడం అన్యాయం !

జూనియర్ జాకీ !

నీకు జాకీ చాన్ కన్నా బాగా కుంగ్ఫూ వచ్చని  ఒప్పుకుంటాను నన్ను వదిలెయ్యరా  బాబూ !

స్త్రీ పురుషుల దృక్పధాలలో తేడా ఉంటుందా ?

Thursday, 28 October 2010

ఇద్దరు స్త్రీలు ఆఫీసులో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నారు !
రమణి  : నిన్న సాయంత్రం భలే గడిచిపోయింది నాకు ! నీ సంగతేమిటి  రాధా ?
రాధ  : అంత అదృష్టమా నాకు ?
          మా ఆయన ఇంటికి వచ్చీరాగానే  గబగబా మూడు నిముషాల్లో తిండి లాగించేసి,
          మంచం ఎక్కేసి  గుర్రు కొట్టేసాడు !
          నువ్వెలా గడిపావో చెప్పవూ ?
రమణి : ఎంత అద్భుతమైన సాయంత్రమో తెలుసా ?
           మా వారు ఇంటికి రాగానే నన్ను మంచి రొమాంటిక్ డిన్నర్ కి తీసుకు వెళ్ళారు !
          అదైన తరువాత ఇద్దరమూ చేతిలో చెయ్యేసి అలా.. అలా.. నడుచుకుంటూ ఇంటికొచ్చాము !
          మా వారు ఇల్లంతా కొవ్వొత్తులతో అలంకరించారు !
          మేము రాత్రంతా అలా చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపాము !
          నాకైతే ఇప్పటికీ యుద్దనపూడి సులోచనా రాణి నవలలో సీన్లా అనిపిస్తోందంటే నమ్ము !
          మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఇలా ?

అదే సమయానికి ఈ రాధా రమణుల భర్తలు వేరే సెక్షన్లో బాతాఖానీ లో ఉన్నారు !

రమణి భర్త రాజారావు : నిన్న సాయంత్రం ఏం చేశావోయ్ ?
రాధ భర్త  కృష్ణారావు : నిన్న సాయంత్రం భలే మజా వచ్చిందిలే !
                             ఇంటికి వెళ్లేసరికి నా ప్రియమైన భార్య టేబుల్ మీద అన్నం తయారుగా ఉంచింది !
                              అంత ప్రేమతో ఆమె తినిపించేసరికి భుక్తాయాసంతో నిద్ర పట్టి తెల్లరేవరకూ
                              మెలుకువరాలేదు  తెలుసా ?
                              ఎంత హాయిగా ఉందో నిన్న !
                              మరి నువ్వెలా గడిపావ్ ?
రమణి భర్త కృష్ణారావు : దారుణమైన రాత్రి బాసూ !
                             నిన్నంతా పనితో అలిసిపోయి ఇంటికి చేరానా, బిల్లు కట్టలేదని ఫ్యూజు పీకేసారు
                              కాబట్టి వంట చెయ్యలేదండీ అంది మా ఆవిడ !
                              చచ్చినట్లు మేమిద్దరం కలిసి బయటకు భోజనానికి వెళ్ళాం !
                              ఆ హొటల్ బిల్లు కట్టేసరికి ఆటోకికూడా డబ్బుల్లేకుండా పోయేసరికి నడుచుకుంటూ
                              ఇంటికి వెళ్ళాల్సి  వచ్చింది !
                               వీధి దీపాలు సరిగా లేని రోడ్లమీద పడకుండా ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉంటూ
                               ఇంటికొచ్చేసరికి గంటసేపు పట్టిందనుకో !
                               ఇంట్లో కరెంటు లేదుగా కొవ్వొత్తులు వెలిగించి పెట్టా !
                               నీకు తెలుసుగా చీకట్లో  వెళ్ళాలంటే  మా భార్యామణికి భయమయ్యే !
                               ఇలా ఒళ్ళంతా పులిసిపోయి నిద్ర పట్టక చస్తోంటే,
                              మా ఆవిడ ఓ గంటదాకా సుత్తేసి కానీ పడుకోలేదు !
                               ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడూ రాకూడదు రా బాబూ !

నీ ముద్దులో మత్తు !

మ్మ్.. ఎంత తియ్యగా ఉన్నావే ?
నీతోనే  ఇంక జీవితమంతా !

అలా తుడుచుకోండి !

బానే నేర్చుకుంటున్నారు మీరిద్దరూ !

 ఈ  కలుషితం పెరిగిపోతున్న  నీళ్ళలో ఇలా రోజూ క్లీన్ చేసుకోవాలి !
లేకపోతే తిరిగి మన గూటికి చేరలేం !

నాకీత రాదు ! హెల్ప్ !

రక్షించండి బాబోయ్ !
ఇదేదో చిన్న చేపనుకుని దిగాను !
ఇక్కడ తిమింగలం ఉన్నట్లుంది !
నాకీత రాదు ! హెల్ప్ !

మాకంత సినిమా పిచ్చి లేదులే !

ఇది  అవతార్  స్టైల్  కాదేహే !
నా రంగే అంత !
మాకంత సినిమా పిచ్చి లేదులే !

ఫాస్ట్ ఫుడ్ !

మా పక్షులే కాదు చేపలు కూడా పిచ్చివే !
లేకపోతే నువ్వు బలే జంప్ చేస్తావ్ అనగానే ఎలా దూకేస్తోందో చూడండి !
ఇంక ఆ...మ్..  పట్ అని లాగించేయడమే !

దో... బూచీ... !

చూసారా నేను కళ్ళు తెరిస్తే కానీ మీకు నేను ఫ్లెమింగో అని తెలియలేదు !
మేమీ మధ్య డిటెక్టివ్  ట్రైనింగ్ తీసుకున్నాం లే !

సరేగానీ దురద పుడితే గోకడానికి ఇక్కడే ఉండండి !

నా ముక్కు పుడక బావుందా ?

వాడేదో ఫోజు పెడుతున్నాడు కానీ అస్సలు హీరో నేనేగా ఈ ఫోటోలో !

Wednesday, 27 October 2010

వీడు నా బిడ్డేనా ?

అలా భయ పడకూడదు కన్నా !
వాళ్ళు నిన్నేమీ చెయ్యలేరు !
నువ్వు కొద్దిగా పెరిగావంటే నిన్ను చూసి పారిపోతారు !

జర్రున జారే నీ సొగసు !

పట్టులాంటి నీ మేను నన్ను నిలవనీయడం లేదు !
ముట్టుకుంటే కందిపోతావేమో అని  భయమేస్తోంది !
పట్టుకోకపోతే జారిపోతానేమోనని కలత పుడుతోంది !

మనం మారం !

అదేమీ  అభివృద్దో   మరి ?
మనం ఇక్కడ ఇలానే బ్రతుకుతుంటాం !
ప్రగతి మన చుట్టూ పరిగెడుతూ ఉంటుంది !
మనకు మటుకు చిక్కదు !
80 శాతం మందికే  కాదు నూటికి నూరు శాతం మందికి ఆహార భద్రత అని ప్రభుత్వం ఆశ చూపించినా అమలు అయ్యేది మటుకూ మన కోసం కాదు !
ఎవరికోసం చేస్తున్నారో వాళ్ళంతా ఇదిగో ఇలానే మనకు అందకుండా పరిగెడుతుంటారు !

స్కూల్ లేట్ గా తెరవాలి !

ఈ సమ్మర్ సెలవులికి పని చేయాలి అంటే భయపడ్డాం  కానీ !
ఇలా బేగ్ లు చూసిందానికి చాక్లెట్లు ఇస్తారంటే మన ఫ్రండ్స్ ని కూడా పిలిచేవాళ్ళం కదూ !

అది ముక్కా ? సంపంగి మొగ్గా ?


ఈ కవులంతా అందమైన అమ్మాయి ముక్కులను సంపెంగ మొగ్గలతో పోలుస్తారు !
వాళ్లకు వర్ణన అయినా రాకుండా ఉండి ఉండాలి లేకపోతే సంపెంగ మొగ్గ చూడలేదో  !
ఒక్కటి మాత్రం నిజం అనిపిస్తోంది నాకిప్పుడు !
 వాళ్ళెవరూ నీ ముక్కు లాంటి ముక్కును చూసి ఉండరు !
 నాకైతే ఇలా నీ ముక్కును గమనిస్తూ ఇక్కడే గడిపేయాలనిపిస్తోందంటే నమ్ము !

నా మేకోవర్ అదిరింది కదూ ?


ఆ మధ్య హాలీవుడ్ వెళ్ళోచ్చా లే !
ఇది ఫంకీ  స్టైల్ అంట ! 
ఇలా మారిన దగ్గరినుంచీ డేట్లే డేట్లు !
తీరిక లేదంటే నమ్మండి !

క్లీన్ అండ్ షూట్ !

 ఇంతకు ముందు షూటింగ్ చేసిన వెధవ గాడిదకు సిగ్గైనా లేదనుకుంటా !
వాడికి  ట్రిగ్గర్ నొక్కాలంటే ---- పడిపోతోందని కోచ్ చెబితే నమ్మలేదు నేను !
ఇక్కడంతా తడి చేసి తుడవనైనా తుడవకుండా  పోయాడు !
ఇప్పుడు నేను ఇక్కడ షూటింగ్ చేయాలంటే క్లీన్ చేసుకోక చస్తానా ?

నా షేర్ నాక్కావాలి !

అంతా అలా వాడి నోట్లో కుక్కక పొతే కొద్దిగా నాకూ పెట్టొచ్చుగా ?

కీపిట్ అప్ !

చూసారా మనం చక్కగా పని చేస్తుంటే మన బాస్ కూడా మనకు సెల్యూట్ చేసేస్తున్నాడు ?

మన్మధరావూ - అతని గర్ల్ ఫ్రెండ్స్ !

Tuesday, 26 October 2010

మన్మధరావు  కు  నలుగురు  గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు !
అందరిలోకీ అతనికి తన నాలుగో గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం !  ఎప్పుడూ కొత్త కొత్త బట్టలూ, నగలూ, కొనిపెడుతూ, సినిమాలు చూబిస్తూ,  వివిధరకాల రుచులు తినిపిస్తూ, బాగా చూసుకుంటూ ఉంటాడు !
ఆమెకు ఏదైనా సరే ఉత్తమ మైనదే ఇవ్వడం అతని అలవాటు !
 
 
మన్మధరావుకి తన మూడో గర్ల్ ఫ్రెండ్  అన్నా బాగా ఇష్టమే ! ఆమెను  ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలకు తిప్పుతూ తన వెంటే ఉంచేవాడు ! కానీ అతనికి మటుకు ఎప్పుడూ ఆమె మీద అపనమ్మకమే ! ఎప్పుడైనా తనను వీడి ఇతరులకు దగ్గరవుతుందని భయపడుతుంటాడు !
  రెండో గర్ల్ ఫ్రెండ్ ని మటుకు బాగా ఇష్టపడేవాడు మన్మధరావు ! ఆమె ఎంతో దయగా, అతనికి అన్ని విషయాలలో సహాయపడుతూ సహనంతో ఉండేది ! అతనికి ఎప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా ఆమెకు చెప్పడం ఆమె  అతనికి సహాయం చేసి కష్టాల లోంచి తప్పించడం చేస్తూ ఉంటుంటుంది !
 
మన్మధరావు మొదటి గర్ల్ ఫ్రెండ్ ఎంతో నమ్మకంగా అతన్నే అంటిపెట్టుకుని ఉండేది ! అతని ఆరోగ్యం, ఆస్తులను చక్కగా చూసుకునేది ! అయితే ఆమె అంటే మన్మధరావు కి అస్సలు ప్రేమ లేదు ! ఆమె మన్మధరావు ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నా అతను ఆమెను పట్టించుకునే వాడు కాదు !

అకస్మాత్తుగా మన్మధరావుకు విపరీతంగా జబ్బుచేసింది ! తనకు ఇంక  ఎక్కువ సమయం లేదని తెలిసిపోయింది అతనికి !  తన విలాస జీవితంలో ప్రస్తుతమైతే నలుగురు గర్ల్ ఫ్రెడ్స్ ఉన్నారు కానీ తాను ఒంటరిగానే చనిపోవాలేమో అని బెంగ పట్టుకుంది !

తన నాలుగో గర్ల్ ఫ్రెండ్ ని అడిగాడు మన్మధరావు " నిన్ను నేను అందరికంటే ఎక్కువ ప్రేమించాను ! ఎన్నో విలువైన బట్టలు కొనిపెట్టి చాలా గొప్పగా చూసుకున్నాను ! ఇప్పుడు నేను మరణించే సమయం దగ్గరపడింది ! మరి  ఇప్పుడు కూడా నువ్వూ నాతొ వచ్చి నాకు తోడుగా ఉంటావా ? "
" అసంభవం  " అని చెప్పేసి వెనక్కు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఆమె ! ఆమె సమాధానం అతనికి గుండెల్లో బాకు దిగబడిన అనుభూతిని కలిగించింది !

అప్పుడు  తన మూడో గర్ల్ ఫ్రెండ్ తో " నా జీవితమంతా నిన్ను ప్రేమించాను  ! ప్రస్తుతం నేను చనిపోతున్నాను ! నువ్వు కూడా నాతొ పాటు వచ్చి నాకు తోడుగా నిలబదతావా ?" అని అడిగాడు మన్మదరావు !
  " అబ్బే ! ఇంత అందమైన జీవితాన్ని వదులుకోలేను ! నువ్వు గనక మరణిస్తే నేను ఇంకొకరిని పెళ్ళిచేసుకుంటాను  " అంది ఆమె ! మన్మధరావు గుండె బరువెక్కింది ! 

 తన రెండో గర్ల్ ఫ్రెండ్ ని అడిగాడు " నాకు ఏ అవసరం వచ్చినా సహాయం కోసం నీవద్దకే వచ్చాను ! నువ్వు నాకోసం నువ్వు ప్రతి సారీ నిలబడ్డావు !  నేను చనిపోయేటప్పుడు  నాతో వచ్చి తోడుగా ఉంటావా ? "
వెంటనే ఆమె " నన్ను క్షమించు ! ఈసారి నేను నీకు సాయం చేయలేను ! కావాలంటే నీ సమాధి వరకూ తోడురాగాలను అంతే " అంది !
అది విన్న మన్మధరావు పని నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది ! 

ఇంతలో " నేను వస్తానుగా నీతో ? నువ్వెక్కడికి వెళ్ళినా గానీ నేనెప్పుడూ నీతోనే ఉంటాను " అంటూ ఒక స్వరం వినిపించింది !
తలెత్తి చూసిన మన్మధరావు కు  సరైన పోషణ లేక చిక్కిపోయిన తన మొదటి గర్ల్ ఫ్రెండ్ కనిపించింది !
ఒక్క సారిగా సత్తువ ఒచ్చినట్లైన మన్మధరావు " నాకవకాశం ఉన్నప్పుడే  నీ పైన శ్రద్ద చూపించాల్సింది ! నన్ను క్షమించు " అన్నాడు !

  నిజానికి మనందరికీ ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ! ( స్త్రీలకైతే బాయ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు )

మన నాలుగో గర్ల్ ఫ్రెండ్ మన శరీరం ! ఎంత సమయమూ, శక్తీ  కేటాయించి శరీరాన్ని అందంగా ఉంచుకున్నా మనం చనిపోతే అది మనని వీడిపోతుంది !
మన   మూడో గరల్ ఫ్రెండ్ మన వస్తువులు, ఆస్తులు , స్థితిగతులు !  మనం చనిపోగానే అవి ఇతరుల వద్దకు వెళ్ళిపోతాయి !

మన రెండో గర్ల్ ఫ్రెండ్ మన కుటుంబం, మిత్రులు, భందువులు ! వారంతా ఎంత మన వెంబడే ఎప్పుడూ ఉన్నా మన సమాధి వరకే తోడు ఉండగలరు !

మన మొదటి గర్ల్ ఫ్రెండ్ మన ఆత్మ !  మనం మన ఆస్తి, పలుకుబడి పెంచుకోవడం కోసం,  ఆనందాల వేటలో  ఏనాడూ  దాన్ని పట్టించుకోం ! అయినా మన వెంబడి ఎక్కడికైనా వచ్చేది ఆత్మ ఒక్కటే !  మనతో మనలో ఒక  భాగంగా కలిసిపోయి ఆది  నుంచి అనంతం దాకా మన తోడుండే ఆత్మను గుర్తించి, దాని వికాసానికి తోడ్పడితే మనకు ఒంటరితనమే లేదు కదూ ?

 { ఇది నాకు ఎవరో మిత్రులు ఇంగ్లీషులో పంపిన వ్యాసం ! తెలుగు మాత్రం చేసాను ! }

కొన్నాళ్ళు ఇంట్లోనే ఉండాలి !

ఈ పెద్దోళ్ళు ఎంత మోసం చేసారు ?
అమీర్ ఖాన్ హెయిర్ స్టైల్ చేయిస్తాం అని చెప్పి ఇలా !
అదేంటంటే గజినీ అంటారు !
మళ్ళీ క్రాఫ్ ఎప్పుడొస్తుందో ? 
మా ఫ్రండ్స్ ఎడిపిస్తారేమో ? 

నేను తీస్తాగా !

పొద్దున్నించీ ఫోటోలు తీస్తూ కదలకుండా ఇలాగే ఉన్నావు !
కాసేపు రెస్ట్ తీసుకో !
నేను తీస్తాగా !
ఇంతకు ముందు నేషనల్ జియోగ్రాఫిక్ వాళ్లకు  తీసిపెట్టాలే !
 మీ వాళ్ళిచ్చే డబ్బులు నువ్వే తీసుకోలే !