కష్టాలు మీకే ఉన్నాయా ?

Wednesday, 20 October 2010


మీకు చదువుకోవడానికి సరైన వసతులు లేవా ?
అయితే ఈ పసికూన సంగతేమిటి ?

 మీ పిల్లల ఆటలకు మంచి పారులు లేవా ?
మరి.. ఈ చిన్నారుల సంగతేమిటి ?

 మీకు కరెంటు లేక ఉక్కగా ఉందా?
మరి ఈ శ్రామికుల సంగతేమిటి ?

 కష్టాలు మీకే ఉన్నాయనుకుంటే మరి ఈ బాలక్రిష్ణుడిని నదిదాటిస్తూ ఉన్న వీళ్ళ సంగతి ఏమిటి ?

 మీకు ఇంటినుంచి వెళ్ళటానికీ , ఇంటికి వెళ్ళటానికీ  ఇబ్బంది గా ఉందా ?
మరి వీళ్ళ సంగతి ఏమిటి ?



మీకు  ఇంక ఓపిక లేదు నేను ఆగిపోతా అనిపిస్తోందా ?
అయితే ఈయన సంగతి ఏమిటి ?

 మీకు తోడు వచ్చే మిత్రులు లేరా ?
మరి వీరి సంగతి ఏమిటి ?

 మీరు బ్రతుకు బండి లాగ లేకపోతున్నారా ?
అయితే ఈయన సంగతి ఏమిటి ?

 మీ ఉద్యోగంలో చాలా శ్రమ పడాలా ?
అయితే ఈ బిడ్డ సంగతి ఏమిటి ?

 మీ ఆదాయం చాలా తక్కువా ?
 అయితే ఈ కూన సంగతి ఏమిటి ?

మీకున్నది చాలా తక్కువని బాధపడుతుంటారా ?
అయితే వరదల్లో తమ సర్వస్వం కోల్పోయిన వీరి సంగతేమిటి ?

 మీకు గేమ్స్ కొనటానికి పాకెట్ మనీ సరిపోదా?
మరి బూట్లు కాపలా కాస్తే వచ్చే డబ్బులతో కడుపు నింపుకునే ఈ బుల్లోడి సంగతేమిటి ?


మీరు ఈ పండక్కి కొత్త జీన్స్ కొనుక్కోలేకపోయారా ?
అసలు కొత్త బట్టలంటే తెలియని ఈ బుడత సంగతేమిటి ?


మీ కాలనీ శుభ్రంగా ఉండదా ?
అస్సలు పరిశుభ్రతంటే మరచినట్లున్న వీళ్ళ ఇళ్ళ గురించి ఏమనాలి ?


మీ బాత్రూం లో వేన్నీళ్ళు రావట్లేదా ?
అసలు బాత్రూమంటే తెలియని ఈ బిడ్డల సంగతేమిటి ?

ఈ సమాజం మీకు న్యాయం చేయలేదా ?
అయితే ఇలాంటి వారి సంగతేమిటి ?

ఇవి నేను ఆర్కుట్లో పెట్టి తరువాత వీడియో గా ఈ బ్లాగులోనే పెట్టిన నా పీ ఎస్ చిత్రాలు !
కానీ వీడియోలో సరిగా వ్యాఖ్యలు చదవలేకపోతున్నాం అని మిత్రులు కొందరు   ఈ మెయిల్స్  ఇచ్చారు !
వారి కోసం ఇక్కడ ఇలా మళ్ళీ ఇస్తున్నాను !

2 comments:

Venkat said...

Namaste prabhakar garu
nice post
ivi chusina tarwata nenu emi rayalekapotunnanu
sudden ga edo badaga anipinchindi avanni chunia tarwata
good post

గీతిక బి said...

మనదగ్గర ఎంత సిరిసంపదలున్నా మనం కొనుక్కోలేనిది తృప్తి. తృప్తి లేని జీవితంలో అన్నీ ఉన్నా ఇంకా ఏదో అసంతృప్తిగ, కష్టంగా ఉంటుంది.

ఫొటోస్ చాలా బాగా గేదర్ చేశారు.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )