మీ మనసంతా నిండిన మమతతో నన్నుమనసున్న మనిషిగా తీర్చిదిద్దిన మనసున్న పెద్దలకు !
నా మనసు చెప్పే నా మానస వ్యధను మనసుపెట్టి కనరూ ?
మానసను నామానస మందిరంలో పెట్టి పూజించే అంత మనస్పూర్తిగా మనసు పారేసుకున్నాను !
నా మానస వీణ పలికే రాగాలను కొద్దిగా మనసు పెట్టి వింటే నా మనసు మీకే అర్థం అవుతుంది !
మనసులేనీ బ్రతుకొక నరకం అనుకొని, ఇంకో మనసు బదులు మానస మనసే బదులు తెచ్చుకుంటే నా మనసు మెచ్చుకుంటుందనిపించింది నా మనసుకు !
మనసా కవ్వించకే ఇలా అనుకుని నా మనసు దొంగిలించి నన్ను మనసులేని వాడినిగా చేసిన మానసకు తన మనసు దోచుకోవడం ద్వారా మంచి మానసిక శిక్ష వేసేశాను !
మనోల్లాసంతో తన మనసు కూడా సన్నాయి పాటలు పాడేస్తోంది ఇప్పుడు !నా మనసున మనసై బ్రతుకున బ్రతుకవ్వడానికి తయారుగా ఉంది మానస !
నా మాటలు మనసులోంచి రాలేదనుకొనే మీరు నా మానస దర్పణం లోకి చూస్తే నా మనసంతా నువ్వే అంటూ నేను మానస కు చెప్పింది అబద్దం కాదని మీ మనసుకు కూడా అర్థం అవుతుంది !
అలా కాదని మీరు వేరే అమ్మాయిని తెస్తే మనస్సాక్షిగా తనకు దగ్గర కాలేక నా మనసు బాధ పడుతుంది !
అది ఆ అమ్మాయి మనసునే కాక అందరి మనసులకూ గాయం చేస్తుంది !
మనసు లేని మనువుతో మనసు పాడైపోయి తాను, కృంగిన మనసుతో నేను మనో యుద్ధం చేస్తూ. మా ఇద్దరి మనసులనూ కుళ్ళ బొడుచుకుంటాం కదా ?
అలా కాక మనసు రాయి చేసుకు బ్రతుకుదాం అనుకున్నా నా మానసను గురించిన ఆలోచనలు మనసు నిండా నిండిపోయి నా మనసు ముక్కలవుతుందేమో !
మనసులేని మనువు వల్ల మనిషికి మనసే తీరని శిక్ష లా మారి మా మనసులు చితికి పోతాయేమో అనుకుంటే నా మనసు మనసులో ఉండట్లేదు !
మనసు గతి ఇంతే అనుకొని నా మనసు బండబారి, బరువైన మనసుతో మనోవేదన ఎక్కువై నా మనస్సు పగిలిపోతే, ఆ మానసిక వేదనను తట్టుకునే శక్తి నా మనసుకు ఉందని నామనసుకు తట్టట్లేదు !
మరణ మృదంగంలా నా మనసుతో ఆడుకుంటారో లేక నా మనసుకు నచ్చిన మానసను అంగీకరిస్తూ నా మనసుతో ఆనంద తాడవం చేయిస్తారో మీ ఇష్టం !
మీరూ మంచి మనసులున్న మంచి మనషులు కాబట్టి కొద్దిగా పెద్ద మనసు చేసుకుని మా మానస నిర్ణయాన్ని మన్నించి మా బుల్లి మనసులకు మనోవేదన తప్పించి మా మనసులు ఉప్పొంగి పోయేలా మంచి మాట మా మనసులకు వినిపిస్తారని మనసంతా కళ్ళూ, చెవులూ చేసుకుని ఎదురు చూస్తున్నాము !
మా మనసులు చెప్పే బాసలు మీరు మీ మనసు చెవులతో వినరూ ?
- మానసతో కలిసి మీ మనో
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
emaindi prabhu garu suddenga?:)
eami cheyyalo cheppandi mi eddari kalayikaku...-:)
ఏదో పెద్దాయన మనసుకవి ఆత్రేయగారు కలలోకి వచ్చి నా మనసు మనసు మీదకి పోయి, సరదాగా ఒకకొడుకు తన తల్లితండ్రులకు రాసినట్లు రాసేసాను! అంతేకానీ ఇది నా ప్రేమ గోల కాదు!
మిత్రులు గమనించి కంగారు వదిలేసుకోవాలని మనవి !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )