తల్లీ నీకు వందనం !

Saturday 23 October 2010

 ఏది నిజం ఏది నీడ ?

 నీరే అద్దమా ?

 ఎన్ని రంగులున్నాయో నీ దారిలో ? 

 నీ  కన్నా అందంగా అల్లుకోగలరా ఎవరైనా?

 వెలుగు నీడల దాగుడుమూతలు ఎంత చూసిన కొత్తగానే ఉంటాయి  !

 నిన్ను చేరడానికి ఎన్ని మెట్లు ఎక్కినా తక్కువే !

 మది పులకరించి పోతుంది నీ వడిలో !

 మేము ఊడ్చి తుడుచుకున్నామా ఇళ్ళల్లో  ఈ అందం ఎక్కడుంటుంది ?

నీ  ఒక్కో వెలుగుకు ఒక్కో అందం !

 వేలాడే చిత్రపటం లా  ఉంటుంటాయి  నీ సొగసులు  !

 జీవితం ధన్యమనిపించే ఆత్మీయత నీ సొత్తు !

 నీ గుండెలో గూడు కట్టుకోవాలని అనిపించని వారు ఉంటారా ? 

 నీ ప్రేమ ప్రవాహంలో ఎన్నేళ్ళు ప్రయాణించినా తక్కువే !

 చిత్రకారుడిలా నిన్ను నువ్వు  రంగులద్దుకుంటుంటే రోజూ నిన్ను దోస్తున్నాం !


నిన్నెలా దోచినా తల్లిలా ఆదరిస్తూనే ఉంటావ్ !

 
 నీ దర్శనమే దైవదర్శనం ! నీవే మా ప్రాణ దాతవు  ! వేయి వేల వందనాలు తల్లీ నీకు !

ఈ ప్రకృతి మాత లేకుంటే  ఎలా ఉండే వాళ్ళం  మనం ?
ఎన్ని మొక్కులు మొక్కితే ఇంత చక్కటి తల్లి దొరుకుతుంది ?
ఈ తల్లిని నాశనం చేస్తూ చేస్తున్న అభివృద్ధి(?) భవిష్యత్తులో మన ముందుతరాలు ఎలా  ఉండబోతున్నారో ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )