మన్మధరావూ - అతని గర్ల్ ఫ్రెండ్స్ !

Tuesday, 26 October 2010

మన్మధరావు  కు  నలుగురు  గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు !
అందరిలోకీ అతనికి తన నాలుగో గర్ల్ ఫ్రెండ్ అంటే చచ్చేంత ఇష్టం !  ఎప్పుడూ కొత్త కొత్త బట్టలూ, నగలూ, కొనిపెడుతూ, సినిమాలు చూబిస్తూ,  వివిధరకాల రుచులు తినిపిస్తూ, బాగా చూసుకుంటూ ఉంటాడు !
ఆమెకు ఏదైనా సరే ఉత్తమ మైనదే ఇవ్వడం అతని అలవాటు !
 
 
మన్మధరావుకి తన మూడో గర్ల్ ఫ్రెండ్  అన్నా బాగా ఇష్టమే ! ఆమెను  ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలకు తిప్పుతూ తన వెంటే ఉంచేవాడు ! కానీ అతనికి మటుకు ఎప్పుడూ ఆమె మీద అపనమ్మకమే ! ఎప్పుడైనా తనను వీడి ఇతరులకు దగ్గరవుతుందని భయపడుతుంటాడు !
  రెండో గర్ల్ ఫ్రెండ్ ని మటుకు బాగా ఇష్టపడేవాడు మన్మధరావు ! ఆమె ఎంతో దయగా, అతనికి అన్ని విషయాలలో సహాయపడుతూ సహనంతో ఉండేది ! అతనికి ఎప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఎదురైనా ఆమెకు చెప్పడం ఆమె  అతనికి సహాయం చేసి కష్టాల లోంచి తప్పించడం చేస్తూ ఉంటుంటుంది !
 
మన్మధరావు మొదటి గర్ల్ ఫ్రెండ్ ఎంతో నమ్మకంగా అతన్నే అంటిపెట్టుకుని ఉండేది ! అతని ఆరోగ్యం, ఆస్తులను చక్కగా చూసుకునేది ! అయితే ఆమె అంటే మన్మధరావు కి అస్సలు ప్రేమ లేదు ! ఆమె మన్మధరావు ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నా అతను ఆమెను పట్టించుకునే వాడు కాదు !

అకస్మాత్తుగా మన్మధరావుకు విపరీతంగా జబ్బుచేసింది ! తనకు ఇంక  ఎక్కువ సమయం లేదని తెలిసిపోయింది అతనికి !  తన విలాస జీవితంలో ప్రస్తుతమైతే నలుగురు గర్ల్ ఫ్రెడ్స్ ఉన్నారు కానీ తాను ఒంటరిగానే చనిపోవాలేమో అని బెంగ పట్టుకుంది !

తన నాలుగో గర్ల్ ఫ్రెండ్ ని అడిగాడు మన్మధరావు " నిన్ను నేను అందరికంటే ఎక్కువ ప్రేమించాను ! ఎన్నో విలువైన బట్టలు కొనిపెట్టి చాలా గొప్పగా చూసుకున్నాను ! ఇప్పుడు నేను మరణించే సమయం దగ్గరపడింది ! మరి  ఇప్పుడు కూడా నువ్వూ నాతొ వచ్చి నాకు తోడుగా ఉంటావా ? "
" అసంభవం  " అని చెప్పేసి వెనక్కు తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది ఆమె ! ఆమె సమాధానం అతనికి గుండెల్లో బాకు దిగబడిన అనుభూతిని కలిగించింది !

అప్పుడు  తన మూడో గర్ల్ ఫ్రెండ్ తో " నా జీవితమంతా నిన్ను ప్రేమించాను  ! ప్రస్తుతం నేను చనిపోతున్నాను ! నువ్వు కూడా నాతొ పాటు వచ్చి నాకు తోడుగా నిలబదతావా ?" అని అడిగాడు మన్మదరావు !
  " అబ్బే ! ఇంత అందమైన జీవితాన్ని వదులుకోలేను ! నువ్వు గనక మరణిస్తే నేను ఇంకొకరిని పెళ్ళిచేసుకుంటాను  " అంది ఆమె ! మన్మధరావు గుండె బరువెక్కింది ! 

 తన రెండో గర్ల్ ఫ్రెండ్ ని అడిగాడు " నాకు ఏ అవసరం వచ్చినా సహాయం కోసం నీవద్దకే వచ్చాను ! నువ్వు నాకోసం నువ్వు ప్రతి సారీ నిలబడ్డావు !  నేను చనిపోయేటప్పుడు  నాతో వచ్చి తోడుగా ఉంటావా ? "
వెంటనే ఆమె " నన్ను క్షమించు ! ఈసారి నేను నీకు సాయం చేయలేను ! కావాలంటే నీ సమాధి వరకూ తోడురాగాలను అంతే " అంది !
అది విన్న మన్మధరావు పని నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది ! 

ఇంతలో " నేను వస్తానుగా నీతో ? నువ్వెక్కడికి వెళ్ళినా గానీ నేనెప్పుడూ నీతోనే ఉంటాను " అంటూ ఒక స్వరం వినిపించింది !
తలెత్తి చూసిన మన్మధరావు కు  సరైన పోషణ లేక చిక్కిపోయిన తన మొదటి గర్ల్ ఫ్రెండ్ కనిపించింది !
ఒక్క సారిగా సత్తువ ఒచ్చినట్లైన మన్మధరావు " నాకవకాశం ఉన్నప్పుడే  నీ పైన శ్రద్ద చూపించాల్సింది ! నన్ను క్షమించు " అన్నాడు !

  నిజానికి మనందరికీ ఈ నలుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు ! ( స్త్రీలకైతే బాయ్ ఫ్రెండ్స్ అనుకోవచ్చు )

మన నాలుగో గర్ల్ ఫ్రెండ్ మన శరీరం ! ఎంత సమయమూ, శక్తీ  కేటాయించి శరీరాన్ని అందంగా ఉంచుకున్నా మనం చనిపోతే అది మనని వీడిపోతుంది !
మన   మూడో గరల్ ఫ్రెండ్ మన వస్తువులు, ఆస్తులు , స్థితిగతులు !  మనం చనిపోగానే అవి ఇతరుల వద్దకు వెళ్ళిపోతాయి !

మన రెండో గర్ల్ ఫ్రెండ్ మన కుటుంబం, మిత్రులు, భందువులు ! వారంతా ఎంత మన వెంబడే ఎప్పుడూ ఉన్నా మన సమాధి వరకే తోడు ఉండగలరు !

మన మొదటి గర్ల్ ఫ్రెండ్ మన ఆత్మ !  మనం మన ఆస్తి, పలుకుబడి పెంచుకోవడం కోసం,  ఆనందాల వేటలో  ఏనాడూ  దాన్ని పట్టించుకోం ! అయినా మన వెంబడి ఎక్కడికైనా వచ్చేది ఆత్మ ఒక్కటే !  మనతో మనలో ఒక  భాగంగా కలిసిపోయి ఆది  నుంచి అనంతం దాకా మన తోడుండే ఆత్మను గుర్తించి, దాని వికాసానికి తోడ్పడితే మనకు ఒంటరితనమే లేదు కదూ ?

 { ఇది నాకు ఎవరో మిత్రులు ఇంగ్లీషులో పంపిన వ్యాసం ! తెలుగు మాత్రం చేసాను ! }

5 comments:

jaggampeta said...

atma gurichi chakkani vishayam chepparu

Rao S Lakkaraju said...

కష్టమయిన వేదాంతాన్ని తేలికగా మనస్సుకి హద్దుకునేటట్లు చెప్పారు. థాంక్స్.

Anonymous said...

/అయినా మన వెంబడి ఎక్కడికైనా వచ్చేది ఆత్మ ఒక్కటే ! /
ఆత్మ కాని ఆ 'మనం ' ఎవరు?

ప్రభు said...

ఆ మనం ఎవరో తెలుసుకుంటేనే ముక్తి !
అది తెలియకే ఈ ఆరాటాలు, తాపత్రయాలు , పోరాటాలు !
ఆ మనం పరమాత్మో లేక శూన్యమో అందరికీ తెలుస్తుంటుంది !
నేను తెలుసుకున్నాక చెప్పే అవకాశం ఉంటే తప్పక చెబుతాను !

Chakradhar Sarma Rayapati said...

nitya satyam baga chepparu nice.
http://namanobavalu.blogspot.com/

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )