ఇద్దరు స్త్రీలు ఆఫీసులో పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఉన్నారు !
రమణి : నిన్న సాయంత్రం భలే గడిచిపోయింది నాకు ! నీ సంగతేమిటి రాధా ?
రాధ : అంత అదృష్టమా నాకు ?
మా ఆయన ఇంటికి వచ్చీరాగానే గబగబా మూడు నిముషాల్లో తిండి లాగించేసి,
మంచం ఎక్కేసి గుర్రు కొట్టేసాడు !
నువ్వెలా గడిపావో చెప్పవూ ?
రమణి : ఎంత అద్భుతమైన సాయంత్రమో తెలుసా ?
మా వారు ఇంటికి రాగానే నన్ను మంచి రొమాంటిక్ డిన్నర్ కి తీసుకు వెళ్ళారు !
అదైన తరువాత ఇద్దరమూ చేతిలో చెయ్యేసి అలా.. అలా.. నడుచుకుంటూ ఇంటికొచ్చాము !
మా వారు ఇల్లంతా కొవ్వొత్తులతో అలంకరించారు !
మేము రాత్రంతా అలా చాలా సేపు కబుర్లు చెప్పుకుంటూ గడిపాము !
నాకైతే ఇప్పటికీ యుద్దనపూడి సులోచనా రాణి నవలలో సీన్లా అనిపిస్తోందంటే నమ్ము !
మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఇలా ?
అదే సమయానికి ఈ రాధా రమణుల భర్తలు వేరే సెక్షన్లో బాతాఖానీ లో ఉన్నారు !
రమణి భర్త రాజారావు : నిన్న సాయంత్రం ఏం చేశావోయ్ ?
రాధ భర్త కృష్ణారావు : నిన్న సాయంత్రం భలే మజా వచ్చిందిలే !
ఇంటికి వెళ్లేసరికి నా ప్రియమైన భార్య టేబుల్ మీద అన్నం తయారుగా ఉంచింది !
అంత ప్రేమతో ఆమె తినిపించేసరికి భుక్తాయాసంతో నిద్ర పట్టి తెల్లరేవరకూ
మెలుకువరాలేదు తెలుసా ?
ఎంత హాయిగా ఉందో నిన్న !
మరి నువ్వెలా గడిపావ్ ?
రమణి భర్త కృష్ణారావు : దారుణమైన రాత్రి బాసూ !
నిన్నంతా పనితో అలిసిపోయి ఇంటికి చేరానా, బిల్లు కట్టలేదని ఫ్యూజు పీకేసారు
కాబట్టి వంట చెయ్యలేదండీ అంది మా ఆవిడ !
చచ్చినట్లు మేమిద్దరం కలిసి బయటకు భోజనానికి వెళ్ళాం !
ఆ హొటల్ బిల్లు కట్టేసరికి ఆటోకికూడా డబ్బుల్లేకుండా పోయేసరికి నడుచుకుంటూ
ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది !
వీధి దీపాలు సరిగా లేని రోడ్లమీద పడకుండా ఒకళ్ళకొకళ్ళు ఆసరాగా ఉంటూ
ఇంటికొచ్చేసరికి గంటసేపు పట్టిందనుకో !
ఇంట్లో కరెంటు లేదుగా కొవ్వొత్తులు వెలిగించి పెట్టా !
నీకు తెలుసుగా చీకట్లో వెళ్ళాలంటే మా భార్యామణికి భయమయ్యే !
ఇలా ఒళ్ళంతా పులిసిపోయి నిద్ర పట్టక చస్తోంటే,
మా ఆవిడ ఓ గంటదాకా సుత్తేసి కానీ పడుకోలేదు !
ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడూ రాకూడదు రా బాబూ !
స్త్రీ పురుషుల దృక్పధాలలో తేడా ఉంటుందా ?
Thursday, 28 October 2010
Posted by ప్రభు at 10/28/2010 01:11:00 pm
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
beautiful
.రమణి ఆసన్నివేశాన్ని ఎంజాయ్ చెయ్యగలిగింది కానీ రాజారావు దాన్ని ఒకదారుణంగా భావించాడు .ఏదైనా ఫీల్ కావటానికి రస హృదయం కావాలి .రాజరావు కూడా మనసుతో ఆ ఫీల్ అనుభవించి వుంటే అదొక మరపురాని రోజు అయివుండేది.ఇంకా కృష్ణారావుకి అన్నివున్నా అల్లుడినోట్లో శని అన్నట్టే.:D
:)
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )