మా బొజ్జా గణపయ్యా !

Saturday, 23 October 2010



మా బొజ్జా గణపయ్యా !
మా ఇంటికి రావయ్యా !
ఉండ్రాళ్ళూ, లడ్డూలూ
చేసామూ తినవయ్యా !
రా... వయ్యా.....

పిల్లలమూ పెద్దలమూ నిన్నే పూజించేమయ్యా !
నీవె మా దిక్కంటూ గుంజీళ్ళూ తీసేమయ్యా !  
మూషికా వాహనా మరువకుండ,  రా.. వయ్యా.... //మా బొజ్జా//

మా శక్తి కొద్ది మేమంతా నిన్నే మొక్కేమయ్యా !
విఘ్నాలు లేని బ్రతుకు మాకు ఇయ్యవయ్యా !
విఘ్నరాజా నువ్వూ వెంటనే, రా.. వయ్యా....//మా బొజ్జా//

ఇది చావా కిరణ్ గారు " పాట ఒకటి వ్రాద్దాం రండి  " అని పెట్టిన బ్లాగ్ లో నేను చేసిన మొదటి పోస్ట్ !
ఎందుకనో ఆ బ్లాగు లో వినాయకుడి మీద పాట పెట్టండి అనంగానే మనసులోంచి వచ్చిన పాట ఇది !
ఆ బ్లాగు లింకు ఇదిగో : http://te.chavakiran.com/blog/?p=1163

2 comments:

Anonymous said...

ఆర్య,
సందర్భము లేని వాఖ్యను ప్రచురిస్తున్నందుకు క్షమించగలరు.ఈ తెలుగు బ్లాగు లోకములో మేము కూడా ఒక చర్చా వేదికను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్ని రాజకీయాలు ఉన్నాయో,తెలుగు బ్లాగు లోకములో కూడా అన్ని రాజకీయాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము.మీరు ఎప్పుడన్నా ఈ తెలుగు బ్లాగు లోకములో చర్చా వేదిక కావాలంటే మా బ్లాగు ఉపయోగించుకోవచ్చు. మా దగ్గర స్వేచ్చ బాగా ఎక్కువ. మేము చాలా లిబరల్.మీరు ఎప్పుడన్నా,ఎవడితో అయినా కెలుకుడు(వాదన) మొదలు పెట్టాలి అనుకుంటే మా బ్లాగుని ఉపయోగించుకోగలరు. మేము కావాల్సిన ఫ్యూయల్ అందించగలము.
మా బ్లాగు http://appi-boppi.blogspot.com/

ఇట్లు,
సదా మీ సేవలో, మీ
అప్పి-బొప్పి

ప్రభు said...

అప్పి బొప్పిగార్లకు !
మీరు స్వేచ్చగా కెలుక్కునేందుకు ఒక బ్లాగు పెట్టాం వచ్చి కెలుక్కోమని పిలిచారు కానీ నాకు ఇతరుల వ్యాఖ్యలను ఖండించే అలవాటు లేదు !
ఎందుకంటే ఎవరికైనా వారి కోణంలోంచి చూస్తే కనిపించిన విషయాన్ని చెబుతారు !
వారి కోణాన్ని దర్శించిన ఆనందమే కానీ, నా కోణమే గొప్పది నేను చెప్పిందే నిజం ధర్మం అనే ఆలోచన నాకు లేదు, రాదు !
అందుకనే కాక నాకు నా బ్లాగుతోనే సమయం సరిపోదు ఇంక కేలికుల్లు చూసే ఓపిక కూడా లేదు !
క్షమిస్తారు కదూ ?

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )