మేం పుట్టేటప్పుడు మమ్మల్ని దేవుళ్ళతో సమానం అంటారు !
మేం పెరగటం మొదలయ్యిన దగ్గరనుంచీ మేము అన్నీ మిమ్మల్ని చూసే నేర్చుకుంటాం !
మాకు ప్రేమ, దయ, జాలి, కరుణ, సహకారం, సహజీవనం, సర్వ మానవ సౌబ్రాత్వత్వం, సర్వ మత సమానత్వం వంటి మంచి గుణాలు నేర్పిస్తే దైవ సమానులుగా పెరుగుతాం !
అలా కాకుండా కులాలనీ, భాషలనీ, ప్రాంతాలనీ, మతాల్నీ, దేశాలనీ, స్త్రీలనీ, పురుషులనీ, ధనికులనీ, పేదలనీ, నల్లవాళ్ళనీ, తెల్లవాళ్ళనీ... ఇలా మమ్మల్ని వేరుచేసి, పోరునేర్పి దయ్యాలుగా మారుస్తారే ?
మాకిష్టం లేకపోయినా మాతో యుద్దాలు చేయిస్తారే ?
మీరు మనుషులు కాదా ?
మీ మానవత్వాన్ని ఎక్కడ దాచారు ?
దానవత్వపు ముసుగులెందుకు తొడిగారు ?
మీరిక ఇంతేనా ?
యుగాంతం వస్తే కానీ మీరు మారరా ?
దేవుళ్ళను దెయ్యాలుగా ఎందుకు చేస్తారు ?
Saturday, 16 October 2010
Posted by ప్రభు at 10/16/2010 10:59:00 am
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
పిక్చర్, టైటిల్, మేటర్లకు పొంతన లేకుండా చక్కగా రాశారు. మీరు తిట్టమని మరీ మొహమాటపెట్టేస్తున్నారు, అదేంటో నాకు కుదరట్లేదు. ప్రస్తుతానికి క్షమించండి :)
హ హా .. ఎంత సుందరం మీ అభిప్రాయం ? తిట్టననే చక్కగా తిట్టారు ! ధన్యవాదాలు !
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )