సెల్ ఫోన్ల తో నా కుప్పిగంతులు !
Wednesday, 13 October 2010
Posted by ప్రభు at 10/13/2010 02:10:00 pm
పేరేదైతే ఏమిటి గానీ మా సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ తో ఈ మధ్య చచ్చే చావొచ్చింది. మనందరమూ టెలిఫోన్ తీసుకోవడానికిచ్చిన ప్రూఫులను గుట్టలుగుట్టలుగా కాపీ చేసుకుని మనకు తెలీకుండా దొంగ కనెక్షన్ లు వాళ్ళ రిటైలర్స్ ఇస్తూ ఉంటే బిజినెస్స్ వస్తోందనీ, లేదా వాళ్ళ ప్రాముఖ్యం పెంచుకోవడం కోసమూ నిశ్సబ్దంగా ఉన్న ఈ సర్వీస్ ప్రొవైడర్ లు అందరూ ఇప్పుడు పోలీసుల పోరు పుణ్యమా అని వాళ్ళ వాళ్ళ కష్టమర్లతో ఇలానే చేస్తూ ఉండి ఉంటారు. నాది ఒకప్పుడు పోస్ట్ పైడ్ కనెక్షనే, దాని మీద రెండు ఆడ్ ఆన్ కనెక్షన్లు ఇచ్చి, బిజినెస్సు పెంచుకుని, మళ్ళీ కొత్త కొత్త ఆఫర్లు ఇచ్చి పోస్ట్ పైడ్ నుంచి ప్రీపైడ్ కి మార్చినదీ వాళ్ళే, ఇప్పుడు ప్రీపైడ్ అంటే భయం వచ్చేలాగా చేస్తున్నదీ వాళ్ళే. అన్ని డాక్యుమెంట్స్, ఫోటో తో పాటు ఇవ్వకుంటే మీ కనెక్షన్ పీక నోక్కేస్తామని ఎస్ ఎం ఎస్ లూ ఆడియో మెస్సేజ్ లూఇచ్చి, అప్పటికీ రాకపోతే ఫోన్ చేసి మరీ చెప్పి మొత్తానికి ఇదివరకిచ్చిన డాక్యుమెంట్లనే మళ్ళీ తీసుకుని కొత్త అప్లికేషన్లు నింపిన్చుకుని వదిలారు. ఒక దానికేమో మళ్ళీ పోస్ట్ పైడ్ కనెక్షన్ ఇస్తాం అని ఆఫర్ ! సరే కానీ అంటే, ఇంటికొచ్చి కొత్త సిం ఒకటి ఇచ్చి, పాతది మూగ పాయినాక దీన్ని ఫోన్ లో పెడితే మళ్ళీ రాగం వస్తుందని చెప్పారు. అన్నీ ఒప్పెసుకున్నాక. మళ్ళీ వెరిఫికేషన్ చెయ్యాలని ఇంటికొచ్చి ఇంట్లో నేను లేకపోయినా అక్కడే జీవిస్తూ ఉంటానని కన్ఫర్మ్ చేసుకుని కూడా మళ్ళీ నాకు ఫోను. మీ ఉద్యోగం ఏమిటి సారూ ?, దాని అడ్రస్ ఎక్కడ ? అని. చెప్పాను. ఎన్నాళ్ళ నుంచీ చేస్తున్నారని మళ్ళీ ఇంకో ప్రశ్న ? చిర్రెత్తుకొచ్చినంత పనయ్యింది నాకు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే నంబర్ మార్చకుండా ఉన్న వాడిని ఇలా అడిగితే ఎలా ? పోస్ట్ పైడ్ నుంచి, ప్రీపైడ్ కీ, ప్రీపైడ్ నుంచి పోస్ట్ పైడ్ కీ వాళ్ళు గెంత మన్నప్పుడల్లా గెంతిన నేను, నా కంపెనీలో ఎన్నాళ్ళుగా పని చేస్తే వాళ్ళకెందుకు చెప్పండి, అతి కాకపొతే. ఇలా అయితే నేను ఇంకో ప్రొవైడర్ దగ్గరికి గెంతేస్తాను అని అల్టిమేటం ఇచ్చేసా !
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )