నీకు గమ్యం దూరంగా ఉన్నా వెనుకంజ వేయకు !
నీ గమ్యం మంచిదైతే పనికిరాని సుత్తి కొట్టి నిన్ను దారి మళ్ళించే ప్రయత్నం చేసే వాళ్ళను దరికి చేరనీకు !
ఎందుకంటే వాళ్ళు ఇదివరకు ఇలానే ఎందఱో మహానుభావులు దారి పొడుగూతా ప్రేమతో నాటిన చెట్లను విచ్చలవిడిగా నరికేస్తూ దారులు చెరిపేశారు !
అందుకని నీవు చేరాల్సిన గమ్యానికి నువ్వు చేరాలంటే నీ దారి నువ్వే ఏర్పరచుకోవాలి !
ఈ లోకంలో నిన్నునీ దారిన వెళ్ళకుండా ఆపేవాళ్ళే ఎక్కువగా ఉంటారు !
నీ దారిలో చెట్లను ( నీ గమ్యాన్ని చేరే సదుపాయాలు ) నువ్వే నాటాలి !
నువ్వు గమ్యం చేరిన సంగతి గొంతెత్తి ప్రకటించు !
నెమ్మదిగా జనం నీ దారి పచ్చదనాన్ని చూసి నీ దారి వెంబడే వస్తారు !
నీ నందనవనాన్ని( నీ గమ్య స్థానం ) అలా అందరూచేరుకుంటారు !
ఏ గమ్యాన్ని చేరడానికైనా ఇదే సూత్రం !
కానీ గమ్యం మంచిదైతేనే ఎక్కువ ప్రతిఫలం లభిస్తుంది !
నిన్ను నేతను చేస్తుంది !
నీ దారే రహదారి అవుతుంది !
4 comments:
మహాద్భుతంగా ఉంది. No words to say.
excellent
Super,boss.
good msg.expeting more from u.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )