నా ప్రేమ వనకన్యా !

Friday, 15 October 2010

నీ మనసు చెప్పే ఊసులు వినాలని..
నీ కళ్ళు చెప్పే కబుర్లు కనాలని..
నీ కురుల  అలలపై వేళ్ళతో వీణలు మీటాలని....
నీతో కలిసి ప్రేమ అనంతం దాకా నడవాలని...
నీకోసం వెతుకుతున్నా !
ఈ ప్రేమారణ్యంలో ఊబిలోకి దించే వన్నెలాడిలే కానీ.. కన్నె లేడులు లేవాయే ! 
నా యవ్వన ఉషస్సు నుంచీ నడుస్తూ వెతుకుతున్నా....
సంధ్య చీకట్లు కమ్మి నా జవం ఉస్సురనక ముందే కనిపించవా ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )