ఒక నర్సరీ టీచర్ తన క్లాస్ లోని పిల్లలను దగ్గరకు పిలిచి " పిల్లలూ రేపటి నుంచీ మనం ఒక ఆట ఆడుదాం సరేనా ? " అన్నారు.
" బలే.. బలే.. సరే మేడం." అన్నారు పిల్లలంతా సంబరంగా చప్పట్లు కొడుతూ.
" అయితే మీరంతా తలా ఒక ఒక సంచి, కొన్ని బంగాళా దుంపలూ తీసుకురావాలి. ఒక్కో బంగాళా దుంప కూ మీకిష్టం లేని వాళ్ళ పేరు పెట్టాలి. అంటే మీకేంతమంది మీద అయిష్టం ఉందో అన్ని బంగాళా దుంపలు తేవాలి అన్నమాట." ఆట ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ చెప్పారా టీచర్..
రెండో రోజు పిల్లలంతా ఒక్కో సంచిలో బంగాళా దుంపలతో, కొత్త ఆట ఆడబోతున్నాం అనే ఆనందంలో క్లాస్ కి వచ్చారు. కొందరు 2 దుంపలు తెస్తే కొందరైతే 3 ఇంకొందరు 5 దుంపల దాకా కూడా తెచ్చారు.
" పిల్లలూ మీరంతా ఇలా ఈ సంచిలో బంగాళా దుంపలను రోజంతా మీతోనే ఉంచుకోవాలి. మీరెక్కడికి వెళితే అక్కడికి అంటే టాయ్లెట్ కి వెళ్ళినా వెంట తీసుకు వెళ్ళాలి. అర్థం అయ్యిందా ? " ఆట నియమాలు చెప్పేశారు టీచర్.
ఇలా ప్రతి రోజూ టీచర్ చెప్పినట్లు ఆ సంచి మోస్తూ పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు. దుంపలు కుళ్ళి " వాసనేస్తోంది టీచర్ " అని కంప్లైంట్ కూడా చేసారు. అయినా ఆపకుండా ఆ ఆట ఆడించారా గురువుగారు. ఆ కంపు భరిస్తూ, బరువులు మోస్తూ పిల్లలంతా దిగాలుగా ఉండసాగారు కొందరి దగ్గర మరీ 5 దుంపలు ఉనాయయ్యే. కొన్నాళ్ళు గడిచినాక ఆట అయిపోయిందని టీచర్ చెప్పగానే పిల్లలందరూ వెళ్లి దుంపల సంచులు బయట పారేసి వచ్చారు. " మీ మీ అనుభవాలు చెప్పండి." అన్న టీచర్ మాటతో పిల్లలందరూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆ బరువు , కంపు వెంట తీసుకు వెళ్ళడంలో తాము పడ్డ పాట్లు వివరించారు. "మాకైతే కొందరి మీద అయిష్టం తగ్గి పోయి దుంపలు తగ్గించాలని అనిపించినా టీచర్ చెప్పారని అలానే మోశాము. " అని కూడా చెప్పారు.
" అవును కదూ పిల్లలూ ? మీరు ఈ కొద్ది రోజులు మోసిన ఈ కుళ్ళు బంగాళా దుంపలకూ, మీ మనస్సులో మోసే ఇతరుల పట్ల ద్వేషానికీ ఏ విధమైన తేడా లేదు. మీరు మోసిన దుంపలు కుళ్ళి వాసన వచ్చినట్లే. ఇతరుల పట్ల ద్వేషం మీ మనసును కలుషితం చేస్తుంది. దాన్ని మీరు వెళ్ళిన ప్రతి చోటికీ మీరు మోసుకు వెళ్తూనే ఉంటారు. కాసిని దుంపలను ఒక వారం రోజులే మొయలేకపోయారే మరి జీవితకాలం ద్వేషం మోయడం ఎంత కష్టమో ఊహించ గలరా ? అంటే మనం ఇతరులను ద్వేషిస్తే మన మనస్సు పాడవుతుంది. మన మనస్సు పాడయితే మన బ్రతుకు పాడవుతుంది. ఇతరులను ద్వేషించడం పాపమయితే, ఇతరులను ప్రేమించడం పుణ్యం అన్నమాట. మరి మీరు ద్వేషాన్ని వదిలేస్తారు కదూ ? " అడిగారా టీచర్.
పిల్లలందరూ ఇంకెప్పుడూ ఎవరినీ ద్వేషించమని ఒక్కమాటగా చెప్పారు.
ఇది పిల్లలే కాదు పెద్దలు కూడా ఆడాల్సిన ఆటే కానీ, బస్తాలుబస్తాల దుంపలు మోసే శక్తి ఎందరికి ఉంటుందంటారు ?
కనిపించకుండా మనం మనస్సులో మోస్తున్న కుళ్ళు దుంపల బరువెంత ?
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఈ కథా మీ సొంతమా? అయితే మాత్రం పిల్లలకే కాదు.. పెద్ద వాళ్ళకి కూడా భలే అర్ధమయ్యేలా చెప్పారు.
chaala baaga chepparu.Nice.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )