సి.బీ.ఐ. అంటే అంతే మరి !
Thursday, 30 December 2010
Posted by ప్రభు at 12/30/2010 11:50:00 am
ఘనత వహించిన సి.బీ.ఐ. మళ్ళీ తన గొప్పతనాన్ని మనందరికీ తెలియచెప్పింది ! చిన్నారి ఆరూషీని చంపిందెవరో తెలుసుకునే క్లూలు దొరకట్లేదు కాబట్టి కేసును మూసేస్తున్నాము అని క్లోజర్ నోటిస్ ఇచ్చింది ! ఇంత చిన్న కేసునే సాధించలేని మన సి.బీ.ఐ. ఇంక 2 జీ స్పెక్ట్రం కుంభకోణాలూ, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం లూ, గనుల దోపిడీలూ, ఎమ్మార్ భూ బాగోతాలూ లాంటి పధకం ప్రకారం జరిగిన నేరాలను ఎలా చేదించగలరు ? అధికార, ధన శక్తులకు దాసోహం అనే సి.బీ.ఐ లాంటి తొత్తు సంస్థల వల్ల మనకు ఒరిగేది ఏమిటి ? న్యాయ, పోలీసు, పరిశోధన, పరిపాలనలను వ్యక్తులు ప్రభావితం చేయకుండా, పక్షపాత రహితంగా, అవినీతికి దూరంగా నిజాయితీగా నడిచే వీలు కల్పించకపోతే మరి ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటి ? పారదర్శకత లేని మన ప్రభుత్వ వ్యవస్థ మనను ఇంకా ఇంకా దోచి వేయడమే తప్ప సామాన్య మానవునికి రక్షణ కల్పించ గలుగుతుందా ? అధికారం లో ఉన్నవారు తమ వ్యతిరేకులను ఇరికిన్చేందుకే సి.బీ.ఐ. ను వాడుకోవాల్సి రావడం ఎక్కువగా కనిపించడం వల్ల సి అంటే కరప్షన్ అనీ బీ అంటే బల్లీయింగ్ అనీ అర్ధాలు చదువుకోవాల్సి రావడం మన ఖర్మ !
మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
Posted by ప్రభు at 12/30/2010 10:48:00 amమిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !
ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాలలోనూ నూతన ఉత్సాహాన్నీ, ఆనందాన్నీ, సమృద్ధినీ, సంతృప్తినీ కలగజేయాలని ఆశిస్తాను !
Happy New Year 2011
Posted by ప్రభు at 12/30/2010 10:47:00 amHappy New Year 2011 to All the Netizens!
Hope that this New Year brings loads of Happiness into all our lives !
ఇన్ స్టంట్ పరిష్కారానికి కాంగ్రెస్ ఎం.పీ. లను కలవండి !
Wednesday, 29 December 2010
Posted by ప్రభు at 12/29/2010 11:44:00 am
కాంగ్రెస్ నేతలు చాలా గొప్ప వాళ్ళు ! పార్టీలన్నీగొంతు చించుకొని అసెంబ్లీ లో పట్టు పట్టినా చీమకుట్టినట్లు అయినా చలించని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క రోజు నిరవధిక నిరాహార దీక్షతో కదిలించి విద్యార్ధుల పై ఉన్న అన్ని కేసులనూ ఎత్తించేసేలా చేసారు ! ఇంక రాష్ట్రాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలకూ ఒకటే మందు ! కాదు కాదు దివ్య అవుషదం ! సమ్మెలకు పిలుపులిస్తోన్న ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ, ఆత్మహత్యలతో జీవితాన్ని అంతం చేసుకుంటూన్న రైతన్నలూ, చేనేత కార్మికులూ, ఉద్యమాలు చేస్తున్న ప్రత్యేకరాష్ట్ర వాదులూ, సమైఖ్య వాదులూ, ఉగ్రవాదంతో జన జీవనాన్ని ఉడికిస్తున్న లష్కరే తోయిబాలూ, ఎల్.టీ.టీ.ఈ. లూ, మావోయిష్టులూ వగైరా వగైరాలూ ఇంక అంత కష్టం పడనవసరం లేదు !
రిమోటు నొక్కితే టీవీ ఆన్ అయినట్లూ, మీట నొక్కితే లైటు వెలిగినట్లూ, ఫిల్టర్ లేకపోయినా కాఫీ ప్రియులకోసం ఇన్ స్టంట్ కాఫీలాగా, టూ మినిట్స్ మాగీ నూడిల్స్ లాగా అన్ని సమస్యలకూ సత్వర పరష్కారం కావాలంటే మన కాంగ్రెస్ ఎం.పీ. లను దీక్షలో కూర్చో పెట్టడమే ! గంటల్లో అన్ని సమస్యలూ పరిష్కరించ బడతాయి ! త్వరపడండి అనవసరపు వ్యయ ప్రయాసలకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ ఎం.పీ.లను దీక్షలో కూర్చో పెట్టండి ! మంచితరుణం మించిన దొరకదు ! ఆలసించిన ఆశాభంగం ! మళ్ళీ కాంగ్రెస్ ఎం.పీ.లకు వాళ్ళ శక్తి/గొప్పదనం వాళ్లకు తెలిసి దీక్షకు ధరలు పెట్టకముందే మీ బుకింగ్ చేసేసుకోండి ! ఇన్నాళ్ళూ ఇలా ఎందుకు చెయ్య లేదని పిచ్చి ప్రశ్నలతో కాలయాపన చేయకండి ! మనకు కావలసింది సమస్యల పరిష్కారమే కానీ అది డ్రామాల వల్ల వచ్చిందా, పోరాటాల వల్ల వచ్చిందా, రాజకీయాలవల్ల వచ్చిందా, న్యాయస్థానాల వల్ల వచ్చిందా అనేది ముఖ్యం కాదు కదా ?
మరీ వెంట వెంటనే కాకుండా రోజు విడిచి రోజు దీక్షలు చేయిస్తే పుణ్యమూ పురుషార్ధమూ దక్కినట్లు వాళ్ళ ఆరోగ్యమూ బాగుంటుంది అంతే కాకుండా సమస్యలన్నీ తీరిపోయి మన రాష్ట్రాన్ని, తరువాత దేశాన్ని, తరువాత ప్రపంచాన్ని సమస్యల రహితంగా చేసి విశ్వ శాంతి సాధించ వచ్చు

బంగారం అందరిదీ !
Posted by ప్రభు at 12/27/2010 03:47:00 pm
డబ్బంతా ఒక చోట చేరకూడదని మన ప్రియతమ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చెబుతుంటే వీళ్ళకు అర్ధం అవుతున్నట్లు లేదు !
అందరికీ తలా ఒక బంగారు కడ్డీ పంచేసేయ్యమని చెప్పేద్దాం !
అందరికీ తలా ఒక బంగారు కడ్డీ పంచేసేయ్యమని చెప్పేద్దాం !
చిరంజీవి మెగా దీక్షకు తయారేనా ?
Posted by ప్రభు at 12/27/2010 03:42:00 pm
కె.సి.ఆర్. నిరాహార దీక్ష చేసి చిదంబరం తో తెలంగాణా ప్రకటన చేయించారు !
లగడపాటి నిరాహార దీక్షతో పాటు పనిలో పనిగా దాగుడుమూతలు ఆడేసారు !
చంద్ర బాబు నిరాహార దీక్ష చేసి తెలుగు దేశం పార్టీని మళ్ళీ జనం తలుచుకునేలా చేసారు !
పార్టీ పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీని చీల్చే లక్ష్యం సిద్ధించడం కోసం జగన్ లక్ష్య దీక్ష చేసారు !
అందరూ చేసి మనం చేయకపోతే జనం తప్పు పడతారేమో అని కాంగ్రెస్ ఎంపీలూ ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుని విద్యార్ధుల మీద కేసులేత్తేయిస్తున్నారు!
మంద కృష్ణ తాను దీక్షలు చేయడమే కాకుండా ఎవరు దీక్ష చేసినా సంఘీభావం ప్రకటించి వీడియోలలో కనిపిస్తుంటారు !
ఇలా అందరూ ఏదో ఒక దీక్ష చేసి తమ పలుకుబడి పెంచేసు కుంటుంటే సామాజిక న్యాయం కోసం ఏదైనా చేసి / చేసినట్లు కనిపించడానికి పాపం చిరంజీవి కూడా ఏదైనా దీక్ష చేయాలంటే పాయింటేమీ లేక కంగారుగా ఉన్నారేమో ?

రక్తం రుచి మరిగిన రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు మీకూ వినిపిస్తోందా ?
Thursday, 23 December 2010
Posted by ప్రభు at 12/23/2010 07:47:00 pm
సాధారణంగా ఒక పార్టీ నేత నిరాహార దీక్ష చేస్తున్నాడంటే ఇతర పార్టీల వాళ్ళు సానుభూతి చూపిస్తుంటారు ! కానీ తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబునాయుడుగారి దీక్ష ఏడవరోజులోకి ప్రవేశించినా ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి తన స్థాయిని మరిచి కఠిన మైన పదాలతో వ్యంగ్యాస్త్రాలు సంధించడం చూస్తుంటే కొంత ఆశ్చర్యం మరింత అనుమానమూ కలుగుతోంది ! అనుభవ రాహిత్యం వల్లనో, లేక తెలుగు భాష మీద పట్టు లేకపోవడం వల్లో కిరణ్ కుమార్ రెడ్డిగారు జడ్చర్ల సభలో అలా అన్నారేమో అనుకుందామంటే నమ్మబుద్ధి కావడం లేదు ! రాజ శేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గరనుండీ కాంగ్రెస్ వారంతా అసెంబ్లీ లో కూడా నోటి దురుసుదనంతో చంద్రబాబుగారిని దూషించి వారికి సంభందించిన ముఖ్యమైన విషయాల మీద ప్రతిపక్షం చర్చించకుండా ఉండేలా చూసుకునేవారు ! కానీ అది వేరు అది వాళ్ళ రాజకీయ ఆయుధం ! కానీ ఒక వ్యక్తి ఆరోగ్యం ప్రమాదకర పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే ఇది ఏదో వ్యూహం లానే ఉన్నట్లు కనిపిస్తోంది ! చంద్రబాబుగారిని రాజకీయంగా ఎదురు కోవడం కష్టం అనిపించి ముందు కె.సి.ఆర్. గారితోనూ తరవాత చిరంజీవిగారితోనూ తెరవెనుక సంభందాలు ఏర్పరుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఇలా ప్రవర్తించడం వెనుక ఏదైనా కుట్ర ఉందేమో అని అనిపిస్తోంది ! అవినీతి స్కాంలతోనూ, అధిక ధరల తోనూ తమ పలుకుబడిని పూర్తిగా మసకబార్చుకున్న కాంగ్రెస్ కు శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ సమర్పించే సమయంలో వచ్చిన ఈ అవకాశం వల్ల తంతే గారెల బుట్టలో పడ్డట్లు అనిపిస్తోందేమో ! శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ సమర్పించిన తరువాత పరిణామాలను ఎదుర్కోవడానికి ఈ పరిస్థితిని ఆయుధంగా వాడుకోవచ్చనీ, ఒకవేళ చంద్రబాబుగారు లేకుండా ఉండే పరిస్థితి (పాపం శమించు గాక) వచ్చినా తమ చేతికి మట్టి అంటకుండా గట్టి ప్రత్యర్ధిని తప్పించుకున్నట్లు అవుతుందని చిత్తూరు జిల్లా నుంచే వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి గారు భావిస్తూ తమ అధిష్టానాన్ని కూడా ఒప్పించి జిల్లాలో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి పన్నిన పన్నాగం కాదు కదా ? ఎలాగూ జగన్ వల్ల, తెలంగాణా సమస్య వల్ల, అధిక ధరల వల్ల, తన పదవి ఎలాగూ స్వల్పకాలానికే కాబట్టి పోయేదేమీ ఉండదనీ, కాంగ్రెస్ పార్టీ కూడా ముందు ముందు రాజకీయ లబ్ది కోసం ఈ అవకాశాన్ని వాడుకోవచ్చనీ, ప్రజలకు పెద్దగా గుర్తు పెట్టుకునే అలవాటు ఉండదు కాబట్టి కొన్నాళ్ళ తరువాత 2014 ఎన్నికలలో కాంగ్రెస్ ఇప్పుడున్న తోకగాళ్ళను పక్కనపెట్టి జగన్ ను దీటుగా ఎదుర్కొని స్వయంగానే అధికారం లోకి రావచ్చనీ, పైగా కేంద్రంలో స్వల్ప మెజారిటీ వచ్చినప్పుడు సమీకరణాలను అటూ ఇటూ చేయడంలో ముందు ఉండగల చంద్రబాబు నాయుడు గారు లేకుంటే అక్కడా ఎదురు ఉండదనీ వీళ్ళ ప్లానా ? కిరణ్ కుమార్ రెడ్డి గారు వ్యంగ్యాస్త్రాలతో చంద్ర బాబు నాయుడు గారిని రెచ్చ కొట్టడంలో వారిని దీక్ష పొరబాటున కూడా విరమించనీయకుండా పౌరుషంతో కొనసాగించేందుకు పురికోల్పుదామనే ఆలోచన కనిపిస్తూ, నాకు ఎందుకో మరి రక్తం రుచి మరిగిన రాజకీయ రాబందుల రెక్కల చప్పుడు వినిపిస్తోంది ! మీకూ వినిపిస్తోందా ?
రాక్షసంగా ప్రవర్తిస్తూన్నఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళు సహిద్దాం ?
Posted by ప్రభు at 12/23/2010 03:20:00 pmకళ్ళు తెరిచి, కుళ్ళు కడిగి,
పళ్ళు కరిచి, రాళ్ళు ఎత్తి,
ఒళ్ళు వంచి, కాళ్ళు మడిచి,
ముళ్ళు ఏరి, బీళ్ళు దున్ని,
నీళ్ళు వెతికి, మళ్ళు తడిపి,
బళ్ళు నింపి, వూళ్ళు నిలిపి,
వేళ్ళు విరిగి, తోళ్ళు చిరిగి,
ఇళ్ళు చేరి, వొళ్ళు మరిచే
దేవుళ్ళు మన రైతన్నలు.
తన రక్తాన్ని చెమటగా కార్చి పంట సిరులతో మన అందరి కడుపు నింపే రైతన్నలకు ఏమిచ్చినా ఋణం తీరదు !
కానీ మనం ఏం చేస్తున్నాం ?
సమయానికి సరిపడిన విత్తనాలు దొరకక నాసి రకం విత్తనాలు వేసి, ఎక్కడ చూసినా ఎరువులున్నా దొంగ మార్కెట్లో అమ్మి జనం దోచుకుంటుంటే, అంతా తన ఖర్మ అని అనుకుంటూ, నేల తల్లిని నమ్ముకున్న రైతన్నలు డబ్బుకోసం మేం అది చేస్తాం ఇది చేస్తాం అని డంబాలు పలికే బాంకులను అప్పడిగితే కుదరదనే సరికి లాభం లేక తప్పని సరిగా సూక్ష్మ రుణాల విష వలయం లో కొట్టు మిట్టాడుతుంటే చోద్యం చూస్తూ సరైన పథకాలను గురించి ఆలోచించకుండా ఏదో చేసాం అనిపించుకోవడానికి బిల్లులు పెట్టేసి, శభాష్ అని మన వీపు మనమే తట్టుకుని చప్పట్లు కొట్టేసుకుంటున్నాం ! వీటన్నిటినీ నియంత్రించాల్సిన ప్రభుత్వ విభాగాలు అవినీతి సుఖం మరిగి మొహం చాటేస్తే ఊరుకుంటున్నాం ! లక్షల కోట్ల కుంబకోణాలు చేస్తూ బంగారు భూములను బంజరులుగా చూపిస్తూ ప్రభుత్వమే అమ్ముకుని డబ్బు చేసుకుంటుంటే వదిలేస్తున్నాం ! ప్రాజెక్టుల పేరుతో ఖజానాలు ఖర్చు చేసి వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకుంటుంటే కిక్కురుమనకుండా కూర్చున్నాం ! చల్లిన విత్తనాలు మొలకెత్తక , మొలకెత్తిన విత్తనాలను కన్నబిడ్డల్లా సాకడానికి తాను కష్ట పడుతూ, పెరిగిన కూలి కూడా నవ్వుతూ ఇస్తూ, వచ్చే దిగుబడి బొటాబొటిగా సరిపోతున్నా నేల తల్లిమీద నమ్మకం చావక మళ్ళీ మళ్ళీ పంట పిల్లల్ని పెంచుతున్న రైతన్నలకు ఈ సంవత్సరం పూర్తిగా నడుం విరిగిపోయినంత పనైపోయింది ! వేరే రాష్ట్రాలలో కన్నా తక్కువ గిట్టుబాటు ధర అయినా దొరుకుతున్దిలే ఎలాగో మళ్ళీ విత్తుకోవచ్చు అని ధైర్యం గా ఉన్న రైతన్నలను వరస తుఫానులూ, వరదలూ ఉక్కిరి బిక్కిరి చేసాయి ! ఇంటికి చేరవలిసిన ఫలసాయం పొలం లోనే కూలిపోతే, కుళ్ళిపోతే, గుండె చిక్క బట్టుకుని ఎంత కుదిరితే అంత అని సాధ్యం అయినంత కాపాడుకుని పోగుచేశారు రైతన్నలు ! ఇంటికొచ్చిన గింజలను ప్రభుత్వం ప్రకటించిన పాకేజీ ప్రకారం అమ్ముకున్నా ఆదాయం మాట దేముడెరుగు అప్పు కూడా తీరదని లెక్కలు చూసుకుని గుండె పగిలి కొందరు రాలుతుంటే, దారి తోచక కొందరు బలవంతంగా ప్రాణ త్యాగం చేస్తోంటే స్కాంల రూపంలో, ప్రాజెక్టుల పేరుతో తాము మింగిన లక్షల కోట్లతో పోలిస్తే అతి తక్కువ మొత్తాన్ని దేశానికి వెన్నెముక అయిన రైతన్నలకోసం ఖర్చు పెట్టడానికి మీనమేషాలు లేక్కవేస్తూ రాక్షసంగా ప్రవర్తిస్తూన్నఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎన్నాళ్ళు సహిద్దాం ?

మీరు నమ్ముతారా ?
Posted by ప్రభు at 12/23/2010 11:33:00 am
మా గురువు గొప్ప మాంత్రికుడండీ !
ఒక్క అద్దం ముక్క మీ ముందు పెట్టి నా బదులు ఇక్కడ నా బొమ్మ ఉన్నట్లు మిమ్మల్ని నమ్మిస్తున్నాడు !
ఒక్క అద్దం ముక్క మీ ముందు పెట్టి నా బదులు ఇక్కడ నా బొమ్మ ఉన్నట్లు మిమ్మల్ని నమ్మిస్తున్నాడు !
త్వరగా శాంతా !
Wednesday, 22 December 2010
Posted by ప్రభు at 12/22/2010 02:00:00 pm
పిల్లలందరికీ కానుకలివ్వడానికి సమయం దగ్గిరపడిందని తనను తాను మల్టిప్లై చేసుకొని వెళ్తున్నాడు చూడండి శాంతాక్లాజ్ !
తొందరలో బళ్ళూ, రైన్ డీర్లను మల్టిప్లై చెయ్యడం మరిచినట్లు ఉన్నాడు !
ఇలా వెళ్తే మరి క్రిస్మస్ టైం కి వెళ్లగలడో లేదో ?
తొందరలో బళ్ళూ, రైన్ డీర్లను మల్టిప్లై చెయ్యడం మరిచినట్లు ఉన్నాడు !
ఇలా వెళ్తే మరి క్రిస్మస్ టైం కి వెళ్లగలడో లేదో ?
నీకు లోపల చలి వేయట్లేదా ?
Posted by ప్రభు at 12/22/2010 11:31:00 am
నేనే ఈ చలికి తాగటానికి నీళ్ళు కూడా గడ్డ కట్టినయ్ అని వణికి పోతూ ఉన్నానా ?
పాపం అదెవరో చూడండి మంచులోనే ఇరుక్కు పోయింది !
ఎలా వస్తుందో ఏమో బయటికి ?
పాపం అదెవరో చూడండి మంచులోనే ఇరుక్కు పోయింది !
ఎలా వస్తుందో ఏమో బయటికి ?
అతివ ఆయుధం !
Tuesday, 21 December 2010
Posted by ప్రభు at 12/21/2010 05:31:00 pm
ఇది ఇలా చేసారు కానీ ఉండేలు లాగా వాడాల్సిన అవసరం లేదులెండి !
వాళ్ళ చూపులే బాణాలుగా తగిలి పడిపోతుంటారు కుర్రకారు !
కాకపొతే వాళ్ళకిష్టం లేని వాళ్ళను వాయించడానికి పనికి రావొచ్చు !
వాళ్ళ చూపులే బాణాలుగా తగిలి పడిపోతుంటారు కుర్రకారు !
కాకపొతే వాళ్ళకిష్టం లేని వాళ్ళను వాయించడానికి పనికి రావొచ్చు !
నీ నీడలో సేద తీరనీ !
Posted by ప్రభు at 12/21/2010 01:42:00 pm
స్వార్ధ ప్రాణులైన మనుషులు కారడవులను చిట్టడవులుగా, చిట్టడవులను కాలనీలుగా మార్చేస్తున్నారు !
నాకీ నీడ ప్రాప్తం ఎన్నాళ్ళో ?
నాకీ నీడ ప్రాప్తం ఎన్నాళ్ళో ?
ఎలా వెళ్ళడం ?
Posted by ప్రభు at 12/21/2010 01:36:00 pm
ఇక్కడి దాకా ధైర్యం చేసి వచ్చాను కానీ ముందుకు పోయే దారి కనిపించట్లా !
ఇప్పుడు వెనక్కు వెళ్ళాలన్నా ధైర్యం చాలట్లేదు !
ఇప్పుడు వెనక్కు వెళ్ళాలన్నా ధైర్యం చాలట్లేదు !
ఆకలేస్తోందా ?
Posted by ప్రభు at 12/21/2010 01:31:00 pmఫోటో తీసేసాగా, పద నీ ఆకలి తీర్చడానికి ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం !
నీ ఫోటో వేస్తే మేగజైన్ వాళ్ళు డబ్బులిస్తారు నాకు !
నా మోడల్ కి డబ్బులవసరం లేకపోయినా ఆకలి తీర్చాలిగా !
భారతం లో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ?
Friday, 17 December 2010
Posted by ప్రభు at 12/17/2010 12:34:00 pmపాకిస్తాన్ లో రూ. 26
బంగ్లాదేశ్ లో రూ. 22
క్యూబా లో రూ.19
నేపాల్ లో రూ. 34
బర్మా లో రూ. 30
ఆఫ్ఘనిస్తాన్ లో రూ. 36
ఇండియా లో రూ. 58 .50
బంగ్లాదేశ్ లో రూ. 22
క్యూబా లో రూ.19
నేపాల్ లో రూ. 34
బర్మా లో రూ. 30
ఆఫ్ఘనిస్తాన్ లో రూ. 36
ఇండియా లో రూ. 58 .50
1 లీటర్ పెట్రోలు కి మూల ధర రూ.16.50
కస్టంస్ డ్యూటీ 11.80%
ఎక్సైజ్ డ్యూటీ 9.75%
ఎక్సైజ్ డ్యూటీ 9.75%
వాట్ సెస్సు 4%
స్టేట్ టాక్స్ 8 % మొత్తం చేరి రూ.50.05
స్టేట్ టాక్స్ 8 % మొత్తం చేరి రూ.50.05
ఇప్పుడు 1 లీటరుకు ఇంకో రూ. 8.00 మాత్రమే ఎక్కువ
మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగాయి కాబట్టే పెంచాల్సి వస్తోంది అంటాయి మరి మన దేశానికి పక్కనే ఉన్న, మనకన్నా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పెట్రోలు తక్కువ ధరకి ఎలా దొరుకుతుందో చెప్పరే ?
మరీ అంతగా తప్పనప్పుడు మూల ధరలో పెంచిన ధరే ప్రజలకు వడ్డిస్తే సరిపోతుందిగా ? మళ్ళీ ఈ టాక్స్ లు కూడా వడ్డించడం ఎందుకూ ?
వాళ్ళు పాపం తమ స్వంత ఖజానాలను పెంచుకొంటూ ప్రాజెక్టుల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే దాన్ని పూడ్చడానికి మందూ సిగరెట్లతో పాటు ఎక్కువగా వాడబడే పెట్రోలూ ఒక మార్గమే !
మాదేం లేదు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం వల్ల పెంచక తప్పట్లేదు అనడం మొసలి కన్నీళ్లు కార్చడం లాంటిదే !
మాదేం లేదు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం వల్ల పెంచక తప్పట్లేదు అనడం మొసలి కన్నీళ్లు కార్చడం లాంటిదే !
ప్రజలను అనునిత్యం నిలువెల్లా దోస్తూ కూడా ప్రజలకే సేవ చేస్తున్నట్లు నటించే భారత విత్త మంత్రులకు జే జే లు !
వివిధ సైన్యాలలో స్త్రీలు !
Thursday, 16 December 2010
Posted by ప్రభు at 12/16/2010 10:43:00 amఅల్జీరియా |
ఆస్ట్రేలియా |
ఆస్ట్రియా |
బహ్రెయిన్ |
బెల్జియం |
బ్రెజిల్ |
కెనడా |
చిలీ |
చైనా |
కొలంబియా |
చెక్ రిపబ్లిక్ |
ఫిన్లాండ్ |
ఫ్రాన్స్ |
ఫ్రాన్స్ |
గ్రీస్ |
హోలాండ్ (ఆమె చేతి పైన ఓం గుర్తు ఉంది ) |
ఇండియా |
ఇండోనేషియా |
ఇరాన్ |
ఇజ్రాయెల్ |
ఇటలీ |
జపాన్ |
కెన్యా |
మెక్సికో |
నేపాల్ |
న్యూజీలాండ్ |
నార్వే |
పాకిస్తాన్ |
పేరూ |
పోలాండ్ |
పోలాండ్ |
పోర్చుగల్ |
రష్యా |
రోమానియా |
సెర్బియా |
సెర్బియా |
సౌత్ కొరియా |
స్పెయిన్ |
స్వీడన్ |
స్విట్జర్ లాండ్ |
తైవాన్ |
టర్కీ |
ఉక్రెయిన్ |
అమెరికా |
వియత్నాం |
ధీరత్వానికి స్త్రీ పురుష భేదాలు లేవు కదూ ?
Subscribe to:
Posts (Atom)