సూర్యుడు ఇంక మనవాడు కాదా ?

Monday, 6 December 2010

గిన్నీసు బుక్కులో ఎక్కడానికి తను చెయ్యగల పని ఏముందా అని కొత్త కొత్త క్రీడలు సృష్టిస్తూ ఉంటారు కొందరు ! వాళ్ళ లానే  స్వీడన్ లో అనుకుంటా ఒకామె రోదసీ హక్కులలో ఉన్న లొసుగులను వెతికి వ్యక్తులకు ఉన్న పూర్తి స్వేచ్చను గుర్తించేసింది ! చటాలున సూర్య్డికి యజమానిని నేనే అని అందరూ గుర్తించాలనీ, సౌర్య శక్తిని వాడుకున్నందుకు తనకు రాయల్టీ ఇచ్చి తీరాలనీ వాదిస్తోంది !
పనిలో పనిగా వచ్చే ఆదాయంలో సగం వాళ్ళ దేశ ప్రభుత్వానికి ఇస్తానని లంచం పెడుతోంది ! పేదరికాన్ని నిర్మూలించడానికి కూడా కొంత శాతం కేటాయించి తనకు ఒక్క పది శాతం ఇస్తే చాలని నొక్కి చెబుతోంది !  ఆమెకు ఆ హక్కు దొరికితే ఇంక ఈ భూప్రపంచం ఆమె బానిస అయినట్లే కదూ !
ఆమెను కట్టడి చేయడానికి ఒక చిన్ని ఆలోచన :
తన ఆస్తిని దాచి పెట్టుకోకుండా ఇలా అందరికీ సూర్య రశ్మి తగిలే లా ఉంచినందుకు అందరికీ అద్దె చెల్లించాలని చెబుదాం !
రేడియేషన్ వల్ల వస్తూన్న చర్మ వ్యాధులకు, ఎండల వల్ల సంభవించే అగ్ని ప్రమాదాలకూ, వడదెబ్బల వల్ల సంభవించే మరణాలకూ  ఆమె భాద్యురాలని చెబుదాం !
ఎండ వలన ఎవరికీ ఇబ్బంది కలగ కుండా ప్రపంచమంతా ఏ సి చేయించాల్సిన భారం కూడా తనదే అందాం !
ఏమంటారు  ?

1 comments:

Hemalatha said...

ha ha ha :) :) avunu alage andaam.tikka kudurutundi.

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )