తన వాటా ఇవ్వలేదని కే వీపీ - వై ఎస్ ఆర్ ను లేపెసారా ?

Friday 10 December 2010

ఇన్నాళ్ళకు మొట్ట మొదటి సారిగా జగన్ వర్గం వారు పబ్లిక్ గా జలయజ్ఞం లో డబ్బులు తినేసారని ఒప్పుకున్నారు !
 నువ్వింకా చిన్న పిల్లాడివిరా నాయనా,  కొన్నాళ్ళు ఆగితే నిన్ను ముఖ్య మంత్రిని చెయ్యకుండా ఉండలేరు అని సుద్దులు చెప్పిన, కే వీ పీ రామచంద్ర రావుగారిని, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ బంధువని కూడా మరిచి పోయి టార్గెట్ చేయడానికి తయారై పోయారు ! ఆయనకు ఎలాగూ సోనియా పదవి ఇవ్వట్లేదు కాబట్టి ఆయన్ను అనేస్తే పరవాలేదని వారి ధీమా అయి ఉంటుంది !
పనిలో పని గా తాము తిని అరాయించుకొని,  డిల్లీ లో అమ్మ వారి దగ్గర కక్కిన అవినీతికి కే వీ పీ గారిని బాద్యుడిని చేసేసి చేతులు దులిపేసుకున్నారు జగన్ మోహన్ గారి వీరాభిమాని కొండా సురేఖ గారు ! అది చాలదన్నట్లు  వై ఎస్ ఆర్ ను హత్య చేశారనీ, దానికీ బాధ్యుడు కూడా ఆయనే అనీ కూసేసారు !
ఇన్నాళ్ళూ కాంగ్రెస్ లో ఉన్నారు కనక దాని గొప్పదనాన్ని కీర్తిస్తూ, సోనియా అమ్మవారి జపం చేస్తూ ఉన్న కుటుంబం, జగన్ గారు బయటకు రాగానే,  కాంగ్రెస్ పనికిరాని పార్టీ అనీ అస్సలు గాంధీ గారే స్వతత్రం రాంగానే కాంగ్రెస్ ను మూసేద్దాం అన్నారనీ, కాంగ్రెస్ పాలన వల్ల ఆంధ్రుల ఆత్మాభిమానానికి దెబ్బతగులుతోందనీ  సాక్షి వేదికగా వాదించడం చూస్తోంటే  రాజకీయాలు ఎంత దిగ జారిపోయాయా  అని బాధేస్తోంది !
మీ కుటుంబానికి అధికార పీఠం ఇస్తే మంచి పార్టీ  ఇవ్వక పొతే చెడ్డ పార్టీ అన్నమాట ! సోనియా దేవతను మచ్చిక చేసుకోవడానికి వై ఎస్ ఆర్ మరుగు దొడ్డి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకూ ఏ పని మొదలు పెట్టినా అన్నిటికీ తెలుగు వారిని వదిలేసి  రాజీవ్, ఇందిర ల పేర్లు పెడుతున్నప్పుడు వీళ్ళకు గుర్తుకు రాలేదేమో ఈ తెలుగోడి ఆత్మ గౌరవం !
ఇప్పుడు  పార్టీ నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి సోనియా మాత,  జల(ధన)యజ్ఞాలలో జరిగిన లొసుగులు బయట పెట్టి వీరి కుటుంబాన్ని తిన్నదంతా కక్కమంటుందేమో అనే భయంతో చేస్తున్న హడావుడి అని అందరికీ తెలిసిందే !
ఇంక వై ఎస్ ఆర్ గారు కే వీ పీ గారిని గుడ్డిగా నమ్మేసి,   పొన్నాలగారితో  కలిసి కేవీపీ ప్రాజెక్టులను పరా పరా మేసేస్తోంటే నోట్లో వేలు పెట్టుకునిచూసేంత అమాయకుడని  మీరు అంటూ ఉంటే నమ్మటానికి, జనం చెవుల్లో కాలీఫ్లవర్లు పెట్టించుకునేంత అమాయకుల్లా కనిపిస్తున్నారా ?
ఇంక వై ఎస్ ఆర్ గారి హత్య జరిగిందనుకుంటే దానికి కే వీ పీ కూడా బాధ్యుడని అనుకుంటే ప్రాణ మిత్రుల మధ్య అంత వైరం ఎప్పుడొచ్చిందో ఎందుకొచ్చిందో కూడా చెప్పి పుణ్యం కట్టుకోండి మరి !  
వాటాలు పంచుకోవడం లో తేడా వచ్చిందా ?  తన వాటా ఇవ్వలేదని కే వీపీ  వై ఎస్ ఆర్ ను లేపెసారా ? ఆయన అంత శక్తి మంతుడా ?
చెప్తే నమ్మేట్లు ఉండాలి సురేఖమ్మా !

3 comments:

srinivasrjy said...

మరిన్ని బ్లాగు పొస్ట్ లకు, అన్ని టెలుగు పత్రికల హెడ్ లైన్స్ కు http://andhravani.in

astrojoyd said...

to b frank,kvp was equally earned a lot wth ysr,but as i know him persanally,he is a good crook in politics.

ప్రభు said...

astrojoyd గారికి :ఆయన ఆంతరంగిక సలహాదారుగా వై.ఎస్.ఆర్. ఎదుగుదలలో ఇతోధిక సాయం చేసిన కే.వీ.పీ. కి ఆయన అవినీతిలో భాగం ఎందుకు ఉండదు సార్ ?
జగన్ కుటుంబం పత్తిత్తుల్లాంటి వారనీ, నోట్లో వేలు పెట్టినా కోరకలేనంత అమాయకులనే విధంగా వారి వీర ప్రచారం చూసి వళ్ళు మండి అన్నదే కానీ కే.వీ.పీ.గారిని సమర్ధించడం కాదు ! సాక్షి పత్రిక, భారతి సిమెంట్స్ లాంటి వాటిని స్థాపించి అతి తక్కువకాలంలో 80 కోట్లు ఎద్వాన్స్ టాక్స్ కట్టేంత విధంగా ఎదగడానికి జగన్ కి తెలిసిన వ్యాపార సూత్రాలు జగానికి తెలిపి కే వీ పీ ని అడుగుతున్నట్లే వై ఎస్ ఆర్ గారు సి ఏం కాకముందు జగన్గారి ఆస్తికీ, ఇప్పటి ఆయన ఆస్తికీ గల తేడాకు కారణాలను సాక్షాలతో ప్రపంచానికీ తెలియచేసి ఇంకా పవిత్రులుగా రుజువు చేసుకోవచ్చు కదా !

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )