భారతం లో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ?

Friday 17 December 2010

పాకిస్తాన్ లో  రూ. 26
బంగ్లాదేశ్ లో  రూ. 22
క్యూబా లో  రూ.19
నేపాల్ లో 
రూ. 34
బర్మా లో 
రూ. 30
ఆఫ్ఘనిస్తాన్ లో 
రూ. 36 
ఇండియా లో  రూ. 58 .50   
1 లీటర్ పెట్రోలు కి మూల ధర రూ.16.50  
కస్టంస్ డ్యూటీ 11.80% 
ఎక్సైజ్ డ్యూటీ  9.75%
 
వాట్   సెస్సు   4% 
స్టేట్  టాక్స్  8 %
 మొత్తం చేరి  రూ.50.05   
 ఇప్పుడు  1 లీటరుకు ఇంకో  రూ. 8.00   మాత్రమే ఎక్కువ   
మన దేశ, రాష్ట్ర ప్రభుత్వాలు అంతర్జాతీయ విపణిలో ధరలు పెరిగాయి కాబట్టే పెంచాల్సి వస్తోంది అంటాయి మరి మన దేశానికి పక్కనే ఉన్న,  మనకన్నా తక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పెట్రోలు తక్కువ ధరకి ఎలా దొరుకుతుందో చెప్పరే ?
మరీ అంతగా తప్పనప్పుడు మూల ధరలో పెంచిన ధరే ప్రజలకు వడ్డిస్తే సరిపోతుందిగా ?  మళ్ళీ ఈ టాక్స్ లు కూడా వడ్డించడం ఎందుకూ ?
వాళ్ళు పాపం తమ స్వంత ఖజానాలను పెంచుకొంటూ  ప్రాజెక్టుల పేరుతో ఖజానాను ఖాళీ చేస్తుంటే దాన్ని పూడ్చడానికి మందూ సిగరెట్లతో పాటు ఎక్కువగా వాడబడే  పెట్రోలూ ఒక మార్గమే ! 
మాదేం లేదు ప్రపంచ వ్యాప్తంగా పెరగడం వల్ల పెంచక తప్పట్లేదు అనడం మొసలి కన్నీళ్లు కార్చడం లాంటిదే ! 
ప్రజలను అనునిత్యం నిలువెల్లా  దోస్తూ కూడా ప్రజలకే  సేవ చేస్తున్నట్లు నటించే భారత విత్త మంత్రులకు జే జే లు !

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )