కాంగ్రెస్ నేతలు చాలా గొప్ప వాళ్ళు ! పార్టీలన్నీగొంతు చించుకొని అసెంబ్లీ లో పట్టు పట్టినా చీమకుట్టినట్లు అయినా చలించని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క రోజు నిరవధిక నిరాహార దీక్షతో కదిలించి విద్యార్ధుల పై ఉన్న అన్ని కేసులనూ ఎత్తించేసేలా చేసారు ! ఇంక రాష్ట్రాన్ని పీడిస్తున్న అన్ని సమస్యలకూ ఒకటే మందు ! కాదు కాదు దివ్య అవుషదం ! సమ్మెలకు పిలుపులిస్తోన్న ఉద్యోగులూ, ఉపాధ్యాయులూ, విద్యార్ధులూ, ఆత్మహత్యలతో జీవితాన్ని అంతం చేసుకుంటూన్న రైతన్నలూ, చేనేత కార్మికులూ, ఉద్యమాలు చేస్తున్న ప్రత్యేకరాష్ట్ర వాదులూ, సమైఖ్య వాదులూ, ఉగ్రవాదంతో జన జీవనాన్ని ఉడికిస్తున్న లష్కరే తోయిబాలూ, ఎల్.టీ.టీ.ఈ. లూ, మావోయిష్టులూ వగైరా వగైరాలూ ఇంక అంత కష్టం పడనవసరం లేదు !
రిమోటు నొక్కితే టీవీ ఆన్ అయినట్లూ, మీట నొక్కితే లైటు వెలిగినట్లూ, ఫిల్టర్ లేకపోయినా కాఫీ ప్రియులకోసం ఇన్ స్టంట్ కాఫీలాగా, టూ మినిట్స్ మాగీ నూడిల్స్ లాగా అన్ని సమస్యలకూ సత్వర పరష్కారం కావాలంటే మన కాంగ్రెస్ ఎం.పీ. లను దీక్షలో కూర్చో పెట్టడమే ! గంటల్లో అన్ని సమస్యలూ పరిష్కరించ బడతాయి ! త్వరపడండి అనవసరపు వ్యయ ప్రయాసలకు స్వస్తి చెప్పి కాంగ్రెస్ ఎం.పీ.లను దీక్షలో కూర్చో పెట్టండి ! మంచితరుణం మించిన దొరకదు ! ఆలసించిన ఆశాభంగం ! మళ్ళీ కాంగ్రెస్ ఎం.పీ.లకు వాళ్ళ శక్తి/గొప్పదనం వాళ్లకు తెలిసి దీక్షకు ధరలు పెట్టకముందే మీ బుకింగ్ చేసేసుకోండి ! ఇన్నాళ్ళూ ఇలా ఎందుకు చెయ్య లేదని పిచ్చి ప్రశ్నలతో కాలయాపన చేయకండి ! మనకు కావలసింది సమస్యల పరిష్కారమే కానీ అది డ్రామాల వల్ల వచ్చిందా, పోరాటాల వల్ల వచ్చిందా, రాజకీయాలవల్ల వచ్చిందా, న్యాయస్థానాల వల్ల వచ్చిందా అనేది ముఖ్యం కాదు కదా ?
మరీ వెంట వెంటనే కాకుండా రోజు విడిచి రోజు దీక్షలు చేయిస్తే పుణ్యమూ పురుషార్ధమూ దక్కినట్లు వాళ్ళ ఆరోగ్యమూ బాగుంటుంది అంతే కాకుండా సమస్యలన్నీ తీరిపోయి మన రాష్ట్రాన్ని, తరువాత దేశాన్ని, తరువాత ప్రపంచాన్ని సమస్యల రహితంగా చేసి విశ్వ శాంతి సాధించ వచ్చు
ఇన్ స్టంట్ పరిష్కారానికి కాంగ్రెస్ ఎం.పీ. లను కలవండి !
Wednesday, 29 December 2010
Posted by ప్రభు at 12/29/2010 11:44:00 am
Subscribe to:
Post Comments (Atom)
1 comments:
ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే అక్కడ హస్తినలో అమ్మభజన చేసేదెవరు అందుకే త్వరగా తీర్పిచ్చేసాం.
Post a Comment
అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )