చిరంజీవి మెగా దీక్షకు తయారేనా ?

Monday, 27 December 2010

కె.సి.ఆర్. నిరాహార దీక్ష చేసి చిదంబరం తో తెలంగాణా ప్రకటన చేయించారు !
లగడపాటి నిరాహార దీక్షతో పాటు పనిలో పనిగా దాగుడుమూతలు ఆడేసారు !
చంద్ర బాబు నిరాహార దీక్ష చేసి తెలుగు దేశం పార్టీని మళ్ళీ జనం తలుచుకునేలా చేసారు !
పార్టీ పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీని చీల్చే లక్ష్యం సిద్ధించడం కోసం జగన్ లక్ష్య దీక్ష చేసారు !
అందరూ చేసి మనం చేయకపోతే జనం తప్పు పడతారేమో అని కాంగ్రెస్ ఎంపీలూ ఒకరోజు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చుని విద్యార్ధుల మీద కేసులేత్తేయిస్తున్నారు!
మంద కృష్ణ తాను దీక్షలు చేయడమే కాకుండా ఎవరు దీక్ష చేసినా సంఘీభావం ప్రకటించి వీడియోలలో కనిపిస్తుంటారు !
ఇలా అందరూ ఏదో ఒక దీక్ష చేసి తమ పలుకుబడి పెంచేసు కుంటుంటే సామాజిక న్యాయం కోసం ఏదైనా చేసి / చేసినట్లు కనిపించడానికి పాపం చిరంజీవి కూడా ఏదైనా దీక్ష చేయాలంటే పాయింటేమీ లేక కంగారుగా ఉన్నారేమో ?

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )