సి.బీ.ఐ. అంటే అంతే మరి !

Thursday 30 December 2010

ఘనత వహించిన సి.బీ.ఐ. మళ్ళీ తన గొప్పతనాన్ని మనందరికీ తెలియచెప్పింది ! చిన్నారి ఆరూషీని చంపిందెవరో తెలుసుకునే క్లూలు దొరకట్లేదు కాబట్టి కేసును మూసేస్తున్నాము అని క్లోజర్ నోటిస్ ఇచ్చింది ! ఇంత చిన్న కేసునే సాధించలేని మన సి.బీ.ఐ. ఇంక 2 జీ  స్పెక్ట్రం కుంభకోణాలూ, కామన్ వెల్త్ గేమ్స్ స్కాం లూ, గనుల దోపిడీలూ, ఎమ్మార్ భూ బాగోతాలూ లాంటి పధకం ప్రకారం జరిగిన నేరాలను ఎలా చేదించగలరు ? అధికార, ధన శక్తులకు దాసోహం అనే సి.బీ.ఐ లాంటి తొత్తు సంస్థల వల్ల మనకు ఒరిగేది ఏమిటి ? న్యాయ, పోలీసు, పరిశోధన, పరిపాలనలను వ్యక్తులు ప్రభావితం చేయకుండా, పక్షపాత రహితంగా, అవినీతికి దూరంగా నిజాయితీగా నడిచే వీలు కల్పించకపోతే మరి ప్రజాస్వామ్యానికి అర్ధం ఏమిటి ?  పారదర్శకత లేని మన ప్రభుత్వ వ్యవస్థ మనను ఇంకా ఇంకా దోచి వేయడమే తప్ప సామాన్య మానవునికి రక్షణ కల్పించ గలుగుతుందా ?  అధికారం లో ఉన్నవారు తమ వ్యతిరేకులను ఇరికిన్చేందుకే సి.బీ.ఐ. ను వాడుకోవాల్సి రావడం ఎక్కువగా కనిపించడం వల్ల సి అంటే కరప్షన్ అనీ బీ అంటే బల్లీయింగ్ అనీ అర్ధాలు చదువుకోవాల్సి రావడం మన ఖర్మ ! 

0 comments:

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )