3 చిలుకలు

Wednesday, 1 December 2010

అప్పారావు తన కొడుకు కు ఒక మంచి పుట్టినరోజు బహుమతి ఇద్దామనుకొని బజారు కి వెళ్ళాడు !  ఏమిద్దామా అని విండో షాపింగ్ చేస్తోంటే ఒక దుకాణం లో అమ్మకానికి పెట్టబడిన ఒకేలాంటి మూడు చిలుకలు పంజరాల్లో కనిపించాయి !
చిలుకే కొనిస్తే బావుంటుందని దుకాణం యజమానిని అడిగాడు !
" ఒక్కో చిలుక ఎంతండీ ? " 
"ఈ చిలుకైతే రెండు వేలు  అండీ" 

"అమ్మో అంటే ఏం చేస్తున్దేమిటీ ఈ చిలుక ?" 
"దీనికి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2000 వచ్చు ! మీ స్ప్రెడ్ షీట్లూ చేసిపెడుతుంది, మీ ఉత్తరాలన్నీ టైప్ చేసేస్తుంది !" గర్వంగా చెప్పాడు షాప్ ఆయన ! 

" ఓహో మరి దాని సంగతేమిటీ ? అదేమైనా తక్కువకు వస్తుందా ? " ఇంకో పక్కనున్న చిలుకను చూపించి అప్పారావు !  
 " అదైతే అయిదు వేలండీ ! దానికి ఆఫీస్ 2000 రావడమే కాకుండా అది మంచి కంప్యూటర్ ప్రోగ్రామర్ అండీ బాబూ !

ఆశ్చర్య పడిపోతూ " సరే మరి ఆ మిగిలిన చిలుక రేటు కూడా చెప్పు " అన్నాడు అప్పారావు !
" అది మీకు పదివేలకి తక్కువకు రాదండీ " చెప్పాడు ఆ షాప్ యజమాని !. " అమ్మో పదివేలే ? దీనికేం విద్యలోచ్చో ?" అడిగాడు అప్పారావు !
" నిజం చెప్పాలంటే దీన్ని ఏదైనా పని చేయగా ఎప్పుడూ చూడలేదండీ ! కానీ మిగిలిన రెండూ దాన్ని బాస్ అని పిలుస్తాయండీ ! " ముక్తాయించాడు షాపు యజమాని !

1 comments:

Lakshmi Raghava said...

baagundi...i enjoyed the song too

Post a Comment

అతిధి దేవోభవ !
నమస్తే !
మీరు నా బ్లాగు దర్శించడమే కాక నా పోస్ట్ ల గురించి ఏదైనా చెప్పాలని అనుకుంటున్నందుకు, కృతజ్ఞుడిని !
సమయాభావం వల్ల ప్రతి కామెంట్ కీ సమాధానం చెప్పలేను కాబట్టి అన్యదా భావించరని ఆశిస్తాను ! మీకందరికీ నచ్చే విధంగా పోస్టులను తయారు చేయడానికి ప్రయత్నిస్తుంటాను ! ఎవరినీ కించపరచాలనేదినా ఉద్దేశ్యం కాదు కానీ పొరబాటున ఎవరినైనా నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !
మరో సారి ధన్యవాదాలు తెలియజేస్తూ
- మీ తెలుగోడు ( ప్రభాకర్ )